న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ప్రాణాల కంటే ఆట ముఖ్యం కాదు.. ట్రంప్‌లా ఆలోచించవద్దు!!

Ajax technical director Overmars compares UEFA, Dutch FA to Donald Trump over Covid-19 response

ఆమ్‌స్టర్‌డామ్‌: మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకు విజృంబిస్తున్నా.. డచ్‌ లీగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్న ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నిర్ణయం పట్ల ఏఎఫ్‌సీ అజాక్స్‌ (ఆమ్‌స్టర్‌డామ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌) టెక్నికల్‌ డైరెక్టర్‌ మార్క్‌ ఓవర్‌మార్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రాణాల కంటే ఆట ముఖ్యం కాదని, డబ్బే పరమావధిగా భావించడం సరికాదన్నారు. యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్స్‌ యూనియన్‌ (యూఈఎఫ్‌ఏ) ఒత్తిడి మూలంగానే డచ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (కేఎన్‌వీబీ) ఈవిధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

<strong>అతడు బ్యాట్‌ప‌ట్టి ఏడాది కూడా కాలేదు.. అప్పుడే నాతో పోటీనా: రోహిత్</strong> అతడు బ్యాట్‌ప‌ట్టి ఏడాది కూడా కాలేదు.. అప్పుడే నాతో పోటీనా: రోహిత్

ప్రాణాంతక కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఫుట్‌బాల్‌ లీగ్‌ను నిలిపివేస్తూ తొలుత నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం జూన్‌ నెల మూడోవారం నుంచి లీగ్‌ ప్రారంభించి.. ఆగస్టు 3 నాటికి ముగించాలని కేఎన్‌వీబీ భావిస్తోంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సస్పెండ్ అయిన సీజన్‌ను ముగించే ప్రయత్నం చేయడం ఓవర్‌మార్స్‌కు చిరాకు తెప్పించింది.

ఈ విషయంపై మార్క్‌ ఓవర్‌మార్స్‌ తాజాగా టెలిగ్రాఫ్‌తో మాట్లాడాడు. కేఎన్‌వీబీ, యూఈఎఫ్‌ఏ తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలతో పోల్చారు. కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. ట్రంప్‌ ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించి కాలాయాపన చేశారని.. ఇప్పుడు ఈ రెండు అసోసియేషన్లు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. 'ఈ సమయంలో ప్రజల జీవితాల కంటే డబ్బే ఎందుకు ముఖ్యమని భావిస్తున్నారు?. కేఎన్‌వీబీకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు గురించి ఆలోచించకుండా యూఈఎఫ్‌ఏ చెప్పినట్లు నడుచుకుంటోంది. అసలు వాళ్లు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు' అని అన్నారు.

'స్పెయిన్‌, ఇంగ్లండ్‌, ఇటలీ, జర్మనీ మాదిరి నెదర్లాండ్స్‌ టెలివిజన్‌ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం గురించి ఆలోచించదు. ఇదంతా యూఈఎఫ్‌ఏ ఒత్తిడి కారణంగానే జరుగుతోంది. కరోనా నియంత్రణ కంటే ఆర్థిక వ్యవస్థే ముఖ్యమన్నట్లు ట్రంప్‌ భావించారు. నెదర్లాండ్స్‌లో కరోనాతో రోజుకు 100 మంది చనిపోతున్నారు. ఈ లీగ్‌ ముగిసిందని ప్రకటించండి. జీవితాలే ముఖ్యమని గ్రహించండి' అని ఓవర్‌మార్స్‌ పేర్కొన్నారు. యూఈఎఫ్‌ఏ చాంపియన్స్‌ లీగ్‌ను గత సీజన్‌లో అజాక్స్‌ టీం గెలుచుకుంది.

Story first published: Thursday, April 2, 2020, 15:32 [IST]
Other articles published on Apr 2, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X