న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా ప్రపంచ కప్ గెలుచుకుంది.. ఫ్రాన్స్ కాదు.. ఆఫ్రికా !!

Africa won the World Cup?: French players (and Obama) have final word

హైదరాబాద్: వలసలు వద్దంటూ అగ్రదేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో.. వలసవాదుల వారసులే ప్రపంచ కప్ విజేతలుగా నిలిచారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫ్రాన్స్ జగజ్జేతగా నిలిచినప్పటికీ ఆ క్రెడిట్ అంతా.. ఆఫ్రికాకే చెందుతుందంటూ పలువురు ట్వీట్ల ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ కూడా ధ్రువీకరించారు. 'ఈ ప్రపంచకప్‌ ఆఫ్రికా గెలుచుకుంది' అంటూ ట్వీట్‌ చేశారు.

ఆయనే కాదు ఇంకా, వెనిజ్వులా దేశాధ్యక్షుడు నికలాస్‌ మద్యూరో కూడా అదే మాట అన్నాడు. 'ఫీఫా కప్‌ ఫ్రాన్స్‌ జట్టును వరించింది. కానీ అది ఆఫ్రికా జట్టులాగానే ఉంది. నిజానికి విజేత ఆఫ్రికానే' అన్నాడాయన. తాజా చాంపియన్‌ ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ జట్టులో మొత్తం ఇరవై ముగ్గురు ఆటగాళ్లుంటే అందులో 15 మంది ఆఫ్రికన్‌ సంతతికి చెందిన వారే కావడంతో ఆఫ్రికా ఖండం హైలైట్‌ అవుతుంది.

1998 వరల్డ్‌కప్‌ నెగ్గిన ఫ్రాన్స్‌ కూడా ఆఫ్రికా సంతతికి వారే

1998 వరల్డ్‌కప్‌ నెగ్గిన ఫ్రాన్స్‌ కూడా ఆఫ్రికా సంతతికి వారే

1998లో ప్రపంచకప్‌ గెలిచిన ఫ్రెంచి జట్టుది, ఇప్పటి జట్టుది ఫొటోలు పెట్టి ‘ఫ్రాన్స్‌ దేశపు వాతావరణం తీవ్రమైన మార్పులకు గురైంది' అన్న వాట్సాప్‌ పోస్టు కూడా చూసే ఉంటారు. ప్రస్తుత జట్టులో నల్ల జాతీయులు ఎక్కువగా ఉండడానికి సంబంధించిన వెటకారం అది. నిజానికి 1998 వరల్డ్‌కప్‌ నెగ్గిన ఫ్రాన్స్‌ జట్టులోని జినదీన్‌ జిదాన్‌, థియొరీ హెన్రీ లాంటి స్టార్‌ ఆటగాళ్లు కూడా ఆఫ్రికా సంతతికి చెందిన వారే.

క్రొయేషియా మినహా ఇతర జట్లలో ఆఫ్రికన్లే ఎక్కువగా

క్రొయేషియా మినహా ఇతర జట్లలో ఆఫ్రికన్లే ఎక్కువగా

2018 ఫిఫా ప్రపంచకప్‌లో నాలుగు యూరొపియన్‌ జట్లే సెమీఫైనల్స్‌ చేరినా వాటిలో క్రొయేషియా మినహా ఇతర జట్లలో ఆఫ్రికన్ల సందడే ఎక్కువగా ఉంది. ఫ్రాన్స్‌ జట్టులోని టీనేజ్‌ సెన్సేషన్‌ కిలియన్‌ ఎంబప్పె, పాల్‌ పోగ్బా, శామ్యూల్‌ ఉంటీటీ, ఎంగోలో కాంటే, మట్వీడీలాంటి స్టార్లంతా ఆఫ్రికన్‌ సంతతి వారే. పారిస్‌ నగర శివారు ప్రాంతాల్లో రోడ్లపైన ఫుట్‌బాల్‌ ఆడుతూ ఎదిగిన వారే.

ఎంబప్పెలాంటి వారికి ఫుట్‌బాల్‌ అనేది

ఎంబప్పెలాంటి వారికి ఫుట్‌బాల్‌ అనేది

పేదరికమే కారణం. ఎంబప్పెలాంటి వారికి ఫుట్‌బాల్‌ అనేది పేదరికం నుంచి బయటపడే గొప్ప తరుణోపాయం. అల్జీరియా, మొరాకో, సెనెగల్‌లాంటి ఆఫ్రికా దేశాలు ఒకప్పుడు ఫ్రాన్స్‌కు వలసలుగా ఉండేవి. తమ ఫ్యాక్టరీలలో కార్మికులుగా పనిచేయడానికి ఆ వలస దేశాల వారిని ఫ్రాన్స్‌కు తరలించేవారు. బెల్జియం జట్టులోని ప్రధాన ఆటగాళ్లు రొమేలు లుకాకు, విన్సెంట్‌ కంపనీ, ఫెలైనీ, చాడ్లీ సహా చాలామంది ఆటగాళ్లు ఆఫ్రికన్లే.

సరిగ్గా ఆడని సందర్భాల్లో వేరు చేసి మాట్లాడతారు:

సరిగ్గా ఆడని సందర్భాల్లో వేరు చేసి మాట్లాడతారు:

‘నేను బాగా ఆడి గోల్స్‌ కొడుతున్నప్పుడు నన్ను బెల్జియం ఆటగాడంటారు. కానీ సరిగ్గా ఆడని సందర్భాల్లో నా గురించి ‘బెల్జియం తరఫున ఆడుతున్న కాంగో సంతతి ప్లేయర్‌' అని రాస్తారు' అని వాపోయాడు లుకాకు. ఇక మరో సెమీఫైనలిస్ట్‌ ఇంగ్లండ్‌ టీమ్‌లోని జెస్సీ లింగార్డ్‌, వాకర్‌, రాష్‌పోర్డ్‌, డేనీ రోజ్‌ లాంటి కీలకమైన ప్లేయర్లంతా ఆఫ్రికన్‌ సంతతి వారే.

ఫ్రాన్స్‌లో కూడా బయటివారిని రానీయకుండా

ఫ్రాన్స్‌లో కూడా బయటివారిని రానీయకుండా

నిజానికి ఇప్పుడు ఫ్రాన్స్‌లో కూడా బయటివారిని రానీయకుండా ఇమ్మిగ్రేషన్‌ చట్టాలు చాలా కఠినతరం చేశారు. కానీ ఒకప్పటి వలస పక్షుల వల్లనే ఆ జట్టు కప్పు గెలుచుకోగలిగింది. విదేశీయులకు నో ఎంట్రీ చెప్పే అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆఫ్రికన్లతో నిండి ఉన్న ఫ్రాన్స్‌ సాకర్‌ జట్టును కొనియాడుతుండటం హాస్యాస్పదం.

Story first published: Friday, July 20, 2018, 13:09 [IST]
Other articles published on Jul 20, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X