న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

వరల్డ్ కప్: అమెరికా ఆడకున్నా... అమెరికన్లు మాత్రం పరుగులు తీస్తున్నారు

By Nageshwara Rao
A World Cup without the United States, but Not Without American Fans

హైదరాబాద్: జూన్ 14 నుంచి రష్యా వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్‌కు రష్యా సర్వం సిద్ధం చేసింది. రష్యా వీధుల్లో ఎక్కడ చూసినా ఫుట్‌బాల్‌ సందడే. ఇప్పటికే ఈ వరల్డ్ కప్‌లో పాల్గొనే 32 జట్లు రష్యాకు చేరుకున్నాయి. ప్రపంచం నలువైపుల నుంచి సాకర్ అభిమానులు రష్యాకు చేరుకుంటున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

రష్యా వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌కు అమెరికా ఫుట్‌బాల్‌ జట్టు అర్హత సాధించని సంగతి తెలిసిందే. దీంతో ఆతథ్య రష్యాతో ఉన్న వైరం దృష్ట్యా ఆ దేశం ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్‌కు అమెరికన్లు వెళతారో లేదో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ వరల్డ్ కప్ చూసేందుకు రష్యా వెళ్తున్న అభిమానుల్లో అమెరికన్లు పెద్ద ఎత్తునే ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.

 66 శాతం మంది ఫిఫా వరల్డ్ కప్ కోసమే

66 శాతం మంది ఫిఫా వరల్డ్ కప్ కోసమే

ప్రస్తుతం అమెరికా నుంచి రష్యాకు వెళ్తున్న ప్రయాణికుల్లో 66 శాతం మంది ఫిఫా వరల్డ్ కప్ కోసమే బయల్దేరుతున్నట్లు అందులో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం నుంచి రష్యాకు వరల్డ్ కప్ వీక్షణ కోసం వెళ్తున్న వారిలో ఎక్కువ మంది అమెరికా నుంచే కావడం విశేషం.

వరల్డ్ కప్ కోసం అమెరికా నుంచి 1,36,503 మంది

వరల్డ్ కప్ కోసం అమెరికా నుంచి 1,36,503 మంది

వరల్డ్ కప్ మొదలయ్యే జూన్‌ 14 నుంచి ముగిసే జులై 15 మధ్య అమెరికా నుంచి 1,36,503 మంది రష్యాకు వెళ్తున్నారు. ప్రపంచకప్‌ కారణంగా ఆ దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య 34 శాతం పెరిగినట్లు తేలింది. జర్మనీ నుంచి కూడా రష్యా వెళ్లే ప్రయాణికుల సంఖ్యలో గణనీనయంగా పెరిగారు.

 ఇటలీ నుంచి 16 శాతం తగ్గింది

ఇటలీ నుంచి 16 శాతం తగ్గింది

ఇదిలా ఉంటే ఇటలీ వరల్డ్ కప్ అర్హత సాధించని నేపథ్యంలో ఆ దేశం నుంచి రష్యాకు వెళ్లే వారి సంఖ్య 16 శాతం తగ్గినట్లు నివేదికలో వెల్లడైంది. ఇక, ఫిఫా వరల్డ్ కప్ కోసం ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తోన్న రష్యా ఈ వరల్డ్ కప్‌ను ఘనంగా నిర్వహించి శెభాష్‌ అనిపించుకోవాలని తహతహలాడుతోంది.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ఈ వరల్డ్ కప్‌కు ఉగ్రవాదం, గుండాయిజంతో పొంచి ఉండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. వరల్డ్ కప్‌కు వస్తోన్న భిమానుల నేపథ్యాన్ని కూడా గట్టిగా తనిఖీ చేస్తోంది. వరల్డ్ కప్ మ్యాచ్‌ల చూసేందుకు వచ్చే వివిధ దేశాల అభిమానులు 12 ఆతిథ్య నగరాల్లో ఎక్కడో ఒక చోట పోలీసుల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకోవాలని రష్యా ఆదేశాలు జారీ చేసింది.

Story first published: Wednesday, June 13, 2018, 11:55 [IST]
Other articles published on Jun 13, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X