న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ నిర్ణయంపై సీరియస్.. టీ20 ట్రై సిరీస్‌లో ఆడమని తేల్చేసిన జింబాబ్వే

Zimbabwe pull out of Bangladesh T20 tri series over ICC suspension

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్ణయంను సీరియస్‌గా తీసుకున్న జింబాబ్వే క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లతో సెప్టెంబర్‌లో ఆడాల్సిన టీ20 ట్రై సిరీస్‌లో జింబాబ్వే పాల్గొనదనని వెల్లడించింది. ఐసీసీ గురువారం జింబాబ్వేను క్రికెట్‌ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

ధోనీ శిక్షణకు ఆర్మీ చీఫ్‌ ఆమోదముద్రధోనీ శిక్షణకు ఆర్మీ చీఫ్‌ ఆమోదముద్ర

ఐసీసీ రాజ్యాంగానికి విరుద్ధంగా జింబాబ్వే క్రికెట్‌ వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సీరియస్ అయిన ఐసీసీ జింబాబ్వే క్రికెట్‌ను సస్పెండ్‌ చేసింది. ఈ సస్పెన్షన్‌ను వెంటనే అమల్లోకి కూడా తెచ్చింది. ఐసీసీ చర్యలపై ఆగ్రహించిన జింబాబ్వే బోర్డు టీ20 ట్రై సిరీస్‌లో ఆడమని తేల్చి చెప్పింది. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లతో కలిసి ఆడాల్సిన టీ20 ట్రై సిరీస్‌ను రద్దు కూడా చేసుకుంది. అంతేకాదు భవిష్యత్‌లోనూ జింబాబ్వే ఆడాల్సిన అన్ని టోర్నీలను రద్దు చేసుకున్నామని తెలిపింది.

అయితే ఐసీసీతో సఖ్యతగా వ్యవహరించి యధావిధిగా తమ కార్యకలాపాలను కొనసాగించాలనుకుంటున్నామని జింబాబ్వే బోర్డు పేర్కొంది. ఇక వీలైనంత తొందరగా తమ ఆటగాళ్లు మళ్లీ క్రికెట్‌ ఆడితే చూడాలని ఉందని బోర్డు వెల్లడించింది. సస్పెండ్‌ సమయంలో 'రాజకీయ జోక్యం లేకుండా క్రికెట్‌ కొనసాగాలని మేము ప్రయత్నిస్తున్నాం' అని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ తెలిపారు. మరి జింబాబ్వే బోర్డు తగ్గితే ఐసీసీ క్షమిస్తుందో చూడాలి.

Story first published: Monday, July 22, 2019, 9:24 [IST]
Other articles published on Jul 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X