న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యుజ్వేంద్ర చహల్‌కు కరోనా సెగ..!!

 Yuzvendra Chahal posts photo with face mask enroute to Dharamsala for 1st ODI

న్యూఢిల్లీ: కరోనా.. కరోనా.. క్యా కరోనా? ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారిని తరిమికొట్టెదెలా? ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ కరోనా వైరస్.. తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే దేశంలో 47 మంది ఈ వైరస్ బారినపడ్డట్టు తెలుస్తోంది. దీని దెబ్బ ఇప్పుడు క్రికెట్‌కు కూడా తాకింది. ఐపీఎల్ 2020 సీజన్‌పైనే నీలినీడలు కమ్ముకున్నాయి. బీసీసీఐ నిర్వహిస్తామంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు బాబాయ్ మాకొద్దు ఐపీఎల్ అని ప్రకటిస్తున్నాయి. రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

చేతులు కలపమంటున్న సఫారీలు..

చేతులు కలపమంటున్న సఫారీలు..

ఈ పరిస్ధితుల్లోనే దక్షిణాఫ్రికా.. భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. కరోనా వైరస్‌కు భయపడుతూనే భారత్‌లో అడుగుపెట్టిన ఆ జట్టు తమ వెంట వైద్య బృందాన్ని తెచ్చుకుంది. వారి సూచనలు, సలహాలు పాటిస్తామని, అవసరమైతే ఎవరితోనూ చేతులు కలపమని ప్రకటించింది.

మాస్క్‌లతో చహల్..

మరోవైపు టీమిండియా కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే బీసీసీఐ నో షేక్ హ్యాండ్.. నో సెల్ఫీస్, నో ఇంటరాక్షన్స్ అని ఆటగాళ్లకు సూచించింది. ప్లేయర్స్ కూడా ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ప్రతీ విషయంపై సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటూ నవ్వులు పూయించే చహల్.. కరోనా వైరస్‌పై అంతే త్వరగా రియాక్టయ్యాడు.

ధర్మశాల వేదికగా సోమవారం తొలి వన్డే జరగనుండగా.. జట్టుతో కలిసేందుకు ఢిల్లీ నుంచి అక్కడికి బయలు దేరిన చాహల్ ముఖానికి మాస్క్ కట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేస్తూ.. మాస్క్, విమాన ఎమోజీలను క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. దీనికి అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కరోనా చహల్ ఒకరంటే.. ఆ మాత్రం ముందు జాగ్రత్తగా ఉండాలని మరొకరు.. నువ్వు మాకు కావాలి చహల్ జాగ్రత్త అంటూ ఇంకోకరు కామెంట్ చేస్తున్నారు.

తొలి వన్డేకు కరోనా ప్రభావం..

తొలి వన్డేకు కరోనా ప్రభావం..

ధర్మశాల వేదికగా జరిగే తొలి వన్డేకు కరోనా ప్రభావం ఉంటుందని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(హెపీసీఏ) డైరెక్టర్ సంజయ్ శర్మ తెలిపారు.

‘భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ అదుపులో ఉన్నప్పటికీ జనాల్లో భయం మాత్రం ఉంది. కాబట్టి మ్యాచ్‌పై కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. పైగా వీకెండ్ లేకపోవడంతో జనాలు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది.'అని శర్మ చెప్పుకొచ్చారు.

Story first published: Tuesday, March 10, 2020, 17:06 [IST]
Other articles published on Mar 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X