న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్‌తో టీ20 సిరిస్‌కు కోహ్లీ స్థానంలో చాహల్: జోక్ చేసిన రోహిత్ శర్మ

Yuzvendra Chahal to be Indias new No.3 during New Zealand T20s, jokes Rohit Sharma

హైదరాబాద్: ఫిబ్రవరి 6 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌లో తనను మూడో స్థానంలో బ్యాటింగ్ దించాలంటూ తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మకు విజ్ఞప్తి చేశాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో విజయం సాధించడంతో సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మను చాహల్ ఇంటర్యూ చేశాడు.

<strong>ధోని వికెట్ల వెనుక ఉంటే... క్రీజు వదలొద్దు: క్రికెటర్లకు ఐసీసీ సలహా</strong>ధోని వికెట్ల వెనుక ఉంటే... క్రీజు వదలొద్దు: క్రికెటర్లకు ఐసీసీ సలహా

న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ విజయాన్ని

న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ విజయాన్ని

ఇందులో భాగంగా తొలుత న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ విజయాన్ని ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారంటూ రోహిత్‌ను ముందుగా చాహల్‌ అడిగాడు. అదే సమయంలో తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చమంటూ రోహిత్ శర్మకు విజ్ఞప్తి చేశాడు. టీ20 సిరిస్‌కు సెలక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అతని స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలంటూ కోరాడు.

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపుతావా

"కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో నన్ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపుతావా రోహిత్‌ భయ్యా. కోహ్లి గైర్హాజరీ కారణంగా ఆ స్థానాన్ని నాకు కేటాయించు" అని చాహల్‌ జోక్‌ చేశాడు. దీనికి రోహిత్‌ శర్మ కూడా తనదైన శైలిలో బదులిచ్చాడు. "నాల్గో వన్డేలో నువ్వు టాప్‌ స్కోరర్‌గా నిలిచావ్‌. అంతవరకూ ఓకే కానీ ఆ మ్యాచ్‌ ఓడిపోయింది కదా. అయినా నీ విజ్ఞప్తిని పరీశిలిస్తాం. నిన్ను మూడో స్థానంలో పంపడానికి కోచ్‌ రవిశాస్త్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా" అని సరదాగా బదులిచ్చాడు.

నాలుగో వన్డేలో భారత్ ఓటమి

నాలుగో వన్డేలో భారత్ ఓటమి

ఐదు వన్డేల సిరిస్‌లో హామిల్టన్‌ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో మాత్రమే భారత్‌ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో భారత్‌ 92 పరుగులకు ఆలౌట్‌ కాగా, అందులో యజువేంద్ర చాహల్‌ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అదే సమయంలో కుల్దీప్‌ యాదవ్‌తో కలిసి 25 పరుగుల భాగస్వామ్యాన్ని చాహల్‌ నమోదు చేశాడు.

Story first published: Monday, February 4, 2019, 13:19 [IST]
Other articles published on Feb 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X