న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బర్త్ డేకు విష్ చేసినప్పుడు రోహిత్‌ను తిట్టిపోసిన యువీ

 Yuvraj Singh warns Rohit Sharma after Mumbai batsman wishes him on his birthday

న్యూ ఢిల్లీ: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బుధవారం 37వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్‌కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వేడుకలో భాగంగానే ముంబై క్రికెటర్ రోహిత్ శర్మ విభిన్నరీతిలో పోస్టు చేశాడు. దానికి స్పందించిన యువీ అంతే చమత్కార ధోరణిలో బదులిచ్చాడు. టీమిండియాలో చోటు దక్కుతుందని ప్రపంచ కప్‌పైనే అన్ని ఆశలు పెట్టుకుని కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాడు.

అవకాశం ఎదురుచూస్తూ..

అవకాశం ఎదురుచూస్తూ..

కాగా, ఇదే ధోరణిలో కొన్ని నెలలుగా టెస్టు జట్టులో చోటు కోసం పరితపించిన రోహిత్ శర్మ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో ఆ అవకాశం చేజిక్కుంచుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రెండో టెస్టును పెర్త్ వేదికగా ఆడనున్న భారత జట్టు ఇప్పటికే అక్కడకు చేరుకుంది. ఆన్‌లైన్ వేదికగా రోహిత్ శర్మ.. ఒకప్పుడు జట్టులో సహచరుడితో జరిగిన సరదా సన్నివేశాన్ని ఒకటి పోస్టు చేసి యువరాజ్ సింగ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఇలాగే మెడ పట్టుకుంటానంటూ స్మైలీలు

ఆ పోస్టులో 'హ్యపీ బర్త్ డే ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్' అనే అర్థం వచ్చేలా రాసి ఉంచాడు. దానిపైన స్పందించిన సిక్సర్ల వీరుడు శుభాకాంక్షలు తెలియజేశాడని కూడా లెక్కచేయకుండా మరోసారి నువ్వు 37కే అవుట్ అయితే ఈ సారి నీ మెడ ఇలాగే పట్టుకుంటానంటూ స్మైలీలు ఉంచాడు. ఇక ఆ పోస్టులో ఉన్న సన్నివేశాలు ఐపీఎల్ ఆడుతున్న సమయంలో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ ఉండగా ఫీల్డింగ్‌లో ఉన్న అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడైన యువరాజ్ సింగ్ ఏదో మాట్లాడేందుకు సరదాగా రోహిత్ మెడను పట్టుకుని ఉన్నాడు.

రెండో టెస్టులో స్థానంపై అనుమానాలు

ఆస్ట్రేలియాతో తన రెండో టెస్టును పెర్త్ వేదికగా ఆడనుంది టీమిండియా. అయితే తొలి టెస్టులో కేవలం 38(37+1) పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో తర్వాతి టెస్టుకు స్థానం దక్కించుకోవడంపై అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

కేవలం 37పరుగులు మాత్రమే చేయడంతో

కేవలం 37పరుగులు మాత్రమే చేయడంతో

తొలి టెస్టు మొదటి రోజు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 41పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఆ తర్వాత మరో వికెట్ అనంతరం జట్టులోకి ఆరో స్థానంలో రోహిత్ వచ్చాడు. హనుమవిహారీ స్థానంలో జట్టులో చోటు సంపాదించుకున్న హిట్టింగ్ మాన్ కేవలం 37పరుగులు మాత్రమే చేయగలిగాడు ఆ తర్వాతి ఇన్నింగ్ప్‌లోనైతే కేవలం ఒక్క పరుగుతోనే సరిపెట్టుకున్నాడు. యువరాజ్ సింగ్‌ను ప్రస్తుతం ఐపీఎల్ నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వదిలేయడంతో ప్రారంభ ధరను కూడా తగ్గించుకుని డిసెంబర్ 18 నుంచి జరగనున్న వేలంలో పాల్గొనున్నాడు.

Story first published: Wednesday, December 12, 2018, 17:18 [IST]
Other articles published on Dec 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X