న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌లో భారత విజయాల్లో అతడిదే కీలకపాత్ర: పాండ్యాపై యువీ ప్రశంస

IPL 2019 : Yuvraj Singh Feels Hardik Pandya Will Play An Important Role In World Cup | Oneindia
Yuvraj Singh says Hardik Pandya will have a big role to play for India at ICC Cricker World Cup 2019

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు విజయాల్లో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కీలకపాత్ర పోషిస్తాడని టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. 25 ఏళ్ల హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 12వ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుని ఫైనల్‌కి చేర్చడంలో హార్ధిక్ పాండ్యా కీలకంగా వ్యవహారించాడు. లీగ్ స్టేజిలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 34 బంతుల్లో 91 పరుగులతో ఆకాశమే హద్దుగా చేలరేగాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ చాలు ఈ సీజన్‌లో పాండ్యా ఎంత కసిగా ఆడుతున్నాడో చెప్పడానికి.

 393 పరుగులతో పాటు 14 వికెట్లు తీసిన పాండ్యా

393 పరుగులతో పాటు 14 వికెట్లు తీసిన పాండ్యా

ఈ సీజన్‌లో మొత్తం 15 మ్యాచ్‌లాడిన పాండ్యా 200కుపైగా స్ట్రయిక్ రేట్‌తో 393 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు తీశాడు. ఐపీఎల్ చేసిన ప్రదర్శననే పాండ్యా వరల్డ్‌కప్‌లో కూడా కొనసాగిస్తాడని యువరాజ్ సింగ్ అన్నాడు. 2011 వరల్డ్ కప్‌లో యువీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుకి ఎంపికైన సంగతి తెలిసిందే.

యువీ మాట్లాడుతూ

యువీ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో యువీ మాట్లాడుతూ "ఐదుగురు ఫీల్డర్ల రూల్ ప్రకారం పార్ట్ టైమర్లు రాణించలేరు. అదే ఐదుగురు(ఫ్రంట్ లైన్) బౌలర్లతో బరిలోకి దిగితే, ఎవరో ఒకరు నాలుగు లేదా ఐదు ఓవర్లు వేయగలరు. ఇందులో కొందరు రాణించలేకపోతే మరొకరు ఆ బాధ్యతను తీసుకోవచ్చు" అని యువరాజ్ సింగ్ తెలిపాడు.

పాండ్యాను కలిసినప్పుడు అదే చెప్పా

పాండ్యాను కలిసినప్పుడు అదే చెప్పా

"ఇదే విషయాన్ని పాండ్యాను కలిసినప్పుడు చెప్పాను. ఇంగ్లాండ్ వరల్డ్‌కప్‌లో అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ రాణించే అవకాశం అతడికి ఉంది చెప్పాను. ప్రస్తుతం అతడు అలాంటి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో ఉన్న ఫామ్‌నే వరల్డ్ కప్‌లో కూడా తప్పకుండా కొనసాగిస్తాడు" అని యువరాజ్ అన్నాడు. వరల్డ్ కప్ కోసం మే22న కోహ్లీసేన ఇంగ్లాండ్‌కు పయనం కానుంది.

Story first published: Thursday, May 9, 2019, 14:49 [IST]
Other articles published on May 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X