న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Left-Handers Day: నా ఫేవరెట్స్‌ లెఫ్ట్‌ హ్యాండర్స్ ఆ నలుగురే.. మరి మీకు?!!

Yuvraj Singh pays tribute to left-handed legends of cricket

హైదరాబాద్: ఫ్రెండ్‌షిప్‌డే, మదర్స్‌డే, ఫాదర్స్‌డే, వాలంటైన్‌ డే మాదిరి ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతివాటం వ్యక్తుల దినోత్సవం (లెఫ్ట్‌హ్యాండర్స్‌ డే). ఎడమచేతివాటం వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 1976 ఆగస్టు 13 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వ హిస్తున్నారు. లెఫ్ట్‌ హ్యాండర్స్‌ అయితే ప్రముఖులుగా వెలుగొందుతారని ఓ నమ్మకం. ఎందరో దేశాధినేతలు, క్రీడాకారులు, నటీనటులు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ కావడం ఈ నమ్మకాన్ని నిజం చేస్తోంది. ఎడమ చేతివాటం ఉన్న వారిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటాయని, ప్రత్యేక వ్యక్తులుగా వెలుగొందుతారని అంటారు.

ఎడమచేతి వాటం వారిలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక, సినీ, క్రీడా రంగాల్లో ఎందరో ప్రముఖులు ఉన్నారు. రాణీ లక్ష్మీబాయి, మహాత్మా గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌, న్యూటన్‌, బిల్ ‌క్లింటన్‌, జార్జి బుష్‌, రతన్ ‌టాటా, సచిన్‌ టెండూల్కర్‌, రవిశాస్త్రి, సౌరవ్ ‌గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, శిఖర్ ‌ధావన్, జహీర్‌ ఖాన్‌, అమితా బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, సావిత్రి, సూర్యాకాంతం, ఇలాంటి ప్రముఖులు ఇంకా ఎందరో ఉన్నారు.

లెఫ్ట్‌హ్యాండర్స్‌ డే సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్ ‌సింగ్‌ ఓ ట్వీట్‌ చేశాడు. 'అంతర్జాతీయ క్రికెట్లోని గొప్ప ఎడమ చేతివాటం ఆటగాళ్లకు నివాళి. నేను నలుగురిని ఎంచుకున్నా. ఈ జాబితాను మరింత పెంచండి. మీకు ఇష్టమైన ఎడమ చేతివాటం క్రికెటర్‌ ఎవరో చెప్పండి' అని యువీ ట్వీట్ చేశాడు. యువరాజ్ ట్వీట్‌ చేసిన వారిలో మాథ్యూ హెడెన్‌‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, బ్రియాన్‌ లారా, సౌరవ్‌ గంగూలీలు ఉన్నారు.

యువరాజ్ ‌సింగ్‌ చేసిన ట్వీట్‌ వైరల్ అయింది. అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. 'భయ్యా.. ఇందులో మీరు యువరాజ్‌ సింగ్‌ పేరు రాయలేదు. భారత్‌లో అతిగొప్ప ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌ అతడే' అని మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా కామెంట్‌ చేశాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లలో అదరగొట్టిన మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ను మర్చిపోయావు అని మరికొందరు ట్వీట్ చేశారు. కుమార సంగక్కర, అలిస్టర్‌ కుక్‌, సర్‌ గ్యారీ సోబర్స్‌, క్లైవ్‌ లాయిడ్‌, సనత్‌ జయసూర్య అని ఇంకొందరు చెప్పారు.

IPL 2020: ఎంఎస్ ధోనీకి కరోనా నెగటివ్.. చెన్నైకి పయనం!!IPL 2020: ఎంఎస్ ధోనీకి కరోనా నెగటివ్.. చెన్నైకి పయనం!!

Story first published: Thursday, August 13, 2020, 19:39 [IST]
Other articles published on Aug 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X