న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ బరిలోకి యూసుఫ్‌ పఠాన్‌, వినయ్, ఓజా.. ఇండియా లెజెండ్స్‌ జట్టు ఇదే!!

Yusuf Pathan, Naman Ojha and Vinay Kumar to feature in Road Safety World Series

ముంబై: భారత మాజీ క్రికెటర్లు యూసుఫ్‌ పఠాన్‌, వినయ్‌ కుమార్, నమన్‌ ఓజా‌ తాజాగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ముగ్గురు మళ్లీ ‌మైదానంలో అడుగు పెట్టనున్నారు. మార్చి 5 నుంచి ప్రారంభంకానున్న టీ20 లీగ్‌ 'రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్'‌లో ఇండియా లెజెండ్స్‌ జట్టు తరఫున వారు బరిలో దిగబోతున్నారు. ఆయా దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే.

ఇండియా లెజెండ్స్‌ జట్టులో భారత మాజీ స్టార్ ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, మునాఫ్ పటేల్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆడుతున్నారు. శ్రీలంక మాజీ దిగ్గజ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య శ్రీలంక లెజెండ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తిలకర్నత దిల్షాన్‌ సారథ్యం వహిస్తున్న లంక టీమ్‌లో జయసూర్యతో పాటు రస్సెల్‌ ఆర్నాల్డ్‌, ఉపుల్‌ తరంగ తదితరులు ఉన్నారు. తరంగ కూడా తాజాగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

మార్చి 5న ‌బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌తో ఇండియా లెజెండ్స్ తలపడనుంది. మార్చి 6న శ్రీలంక లెజెండ్స్‌తో వెస్టిండీస్‌ లెజెండ్స్‌ పోరాడనుంది. ఈ సిరీసులోని అన్ని మ్యాచులు షాహిద్‌ వీర్‌ నారాయణ్‌‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో బయోబబుల్ మధ్య జరుగుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ సిరీస్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. తొలి ఎడిషన్‌లో నాలుగు మ్యాచులు ముగిశాక 2020 మార్చి 11న కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ టోర్నీనే ఇప్పుడు మొదలవ్వనుంది.

ఇండియా లెజెండ్స్‌ జట్టు:
సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, నోయెల్‌ డేవిడ్‌, మునాఫ్ పటేల్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, మన్‌ప్రీత్‌ గోనీ, యూసుఫ్‌ పఠాన్‌, నమన్‌ ఓజా, ఎస్‌ బద్రీనాథ్‌, వినయ్‌ కుమార్‌.

India vs England: పీటర్సన్‌.. నువ్ ఒక్కడివే అర్థం చేసుకున్నావ్: రోహిత్India vs England: పీటర్సన్‌.. నువ్ ఒక్కడివే అర్థం చేసుకున్నావ్: రోహిత్

Story first published: Saturday, February 27, 2021, 18:48 [IST]
Other articles published on Feb 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X