న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టీ20లో ఫీల్డింగ్ తడబాటు?: ఫీల్డర్ల తప్పిదాలపై మండిపడ్డ యువరాజ్

India vs West Indies 1st T20 : Yuvraj Singh Slams India's Fielding Effort || Oneindia Telugu
Young guns reacting a bit late: Yuvraj Singh slams Indias fielding effort in Hyderabad T20I

హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా వెస్టిండిస్‌తో ముగిసిన తొలి టీ20లో టీమిండియా ఫీల్డింగ్‌పై మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మండిపడ్డాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన టీమిండియా మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా విండిస్‌తో జరిగిన తొలి టీ20లో ఫీల్డింగ్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

తొలి టీ20లో టీమిండియా ఫీల్డర్ల తప్పిదాలు మరోసారి కనిపించాయి. చేతుల్లోకి వస్తున్న బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన వాషింగ్టన్ సుందర్ ఒక అడుగు వెనకే ఉండిపోయి హెట్‌మెయిర్‌కు మొదట్లోనే లైఫ్ ఇచ్చాడు. చాహర్‌ వేసిన 16వ ఓవర్లో సునాయాసమైన క్యాచ్‌ను షార్ట్‌ ఫైన్‌లెగ్‌లో సుందర్‌ అందుకోలేకపోయాడు.

క్యాచ్‌ను అంచనా వేయడంలో

క్యాచ్‌ను అంచనా వేయడంలో

క్యాచ్‌ను అంచనా వేయడంలో పొరబడ్డ సుందర్‌ రెండడుగులు వెనక్కి వెళ్లగా.. బంతి అతడి ముందే పడింది. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హెట్‌మెయిర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇక, బౌండరీ వద్ద నేరుగా చేతుల్లో పడ్డ బంతిని రోహిత్ శర్మ సిక్స్ పోనిచ్చాడు. చాహర్‌ వేసిన తర్వాతి ఓవర్లో తొలి మూడు బంతులూ క్యాచ్‌లే.

సుందర్‌ ఓ క్యాచ్‌ను వదిలేయగా

సుందర్‌ ఓ క్యాచ్‌ను వదిలేయగా

వాషింగ్టన్ సుందర్‌ ఓ క్యాచ్‌ను వదిలేయగా, బౌండరీ వద్ద రోహిత్‌ శర్మ రెండు క్యాచ్‌లు మిస్ చేశాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి ఓవర్‌లో జాసన్ హోల్డర్ ఇచ్చిన క్యాచ్‌ను చేజార్చాడు. దీంతో టీమిండియా ఫీల్డింగ్‌లో విఫలమైందని మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సైతం ట్వీట్ చేశాడు.

యువరాజ్ తన ట్విట్టర్‌లో

యువరాజ్ తన ట్విట్టర్‌లో "భారత్ పేలవంగా ఫీల్డింగ్‌ చేసింది. బంతిని అందుకోవడంలో యువ ఆటగాళ్లు నిదానంగా కదులుతున్నారు. ఎక్కువగా క్రికెట్‌ ఆడుతుండటంతో ఇలా చేస్తున్నారా?" అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా, తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

6 వికెట్ల తేడాతో విజయం

6 వికెట్ల తేడాతో విజయం

మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(50 బంతుల్లో 94; 6 ఫోర్లు, 6 సిక్సులు), ఓపెనర్ కేఎల్ రాహుల్(40 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. రెండో టీ20 ఆదివారం తిరువనంతపురంలో జరగనుంది.

Story first published: Saturday, December 7, 2019, 14:15 [IST]
Other articles published on Dec 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X