న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆశ్చర్యపోతారు! 1983లో కపిల్‌దేవ్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

How Much Kapil Devs Team Earned For One Match In 1983..? || Oneindia Telugu
You wont believe how much Kapil Devs team earned for one match in 1983!


హైదరాబాద్: ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆటగాళ్లు కోట్లలో సంపాదిస్తున్నారు. బోర్డు నుంచి తీసుకునే జీతంతో పాటు యాడ్‌ల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. అయితే టీమిండియాలో చోటు దక్కించుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో అదృష్టం ఉండాలి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఒక్కసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత ఆటగాళ్లు మ్యాచ్ ఫీజ్‌, ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్‌.. ఇలా కోట్ల‌లోనే సంపాదిస్తున్నారు. టెస్టులు, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి ఎ+, ఎ, బి, సి కేట‌గిరీలుగా విభజించి బీసీసీఐ ప్రతి ఏటా ఒప్పందం చేసుకుంటుంది.

ఎ+ కేటగిరీ కింద ఏడాదికి రూ. 7 కోట్లు

ఎ+ కేటగిరీ కింద ఏడాదికి రూ. 7 కోట్లు

ఎ+ కేటగిరీలో చోటు దక్కించుకున్న ఆటగాడికి ఏడాదికి రూ. 7 కోట్లుగా మ్యాచ్ ఫీజు కింద బీసీసీఐ చెల్లిస్తోంది. అదే ఎ కేటగిరీలో ఉంటే 5 కోట్లు, `బి`లో ఉంటే 3 కోట్లు, `సి` అయితే కోటి రూపాయ‌ల చొప్పున సంవ‌త్స‌రానికి చెల్లిస్తోంది. దీనికి తోడు ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్ ద్వారా వ‌చ్చే సంపాదన అదనం.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా 12వ ఎడిషన్ ప్రపంచకప్ ముగిసిన నేపథ్యంలో ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1983లో ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన క‌పిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా అందుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యానికి లోనవుతారు. ప‌్ర‌స్తుత ఆట‌గాళ్ల సంపాద‌న‌తో పోల్చి చూస్తే మతిపోతుంది.

భార‌త్‌-పాక్ మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే ఎగ్జిబిష‌న్ మ్యాచ్‌లో

భార‌త్‌-పాక్ మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే ఎగ్జిబిష‌న్ మ్యాచ్‌లో

1983 సెప్టెంబ‌ర్‌లో భార‌త్‌-పాక్ మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే ఎగ్జిబిష‌న్ మ్యాచ్ టీమ్ షీట్‌ను స్పోర్ట్స్ జ‌ర్న‌లిస్ట్ మ‌క్రంద్ బ‌య‌ట‌పెట్టారు. అప్ప‌ట్లో ఇలా వేర్వేరు విభాగాల్లో ఆట‌గాళ్ల‌ను చేర్చి మ్యాచ్ ఫీజు చెల్లించే ప‌ద్ధ‌తి లేదు. మేనేజ‌ర్‌తో స‌హా ఆట‌గాళ్లంద‌రికీ ఒక‌టే ఫీజుని బీసీసీఐ చెల్లించేది.

కెప్టెన్ నుంచి మేనేజ‌ర్ వరకు ఒకటే పారితోషకం

కెప్టెన్ నుంచి మేనేజ‌ర్ వరకు ఒకటే పారితోషకం

ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం త‌ర్వాత పాక్‌తో వన్డే మ్యాచ్ ఆడిన భార‌త ఆట‌గాళ్లు ఒక్కొక్క‌రు మ్యాచ్ ఫీజుగా రూ.1500గా ఉండటం విశేషం. ఇక, డైలీ అల‌వెన్స్ కింద మూడ్రోజుల‌కు గాను రూ.600లు బీసీసీఐ చెల్లించేది. మొత్తం కలిపితే రూ.2100. కెప్టెన్ క‌పిల్ దేవ్ నుంచి మేనేజ‌ర్ బిష‌న్ సింగ్ బేడీ వ‌ర‌కు అంద‌రికీ ఒక‌టే పారితోషికం ఇవ్వడం విశేషం.

Story first published: Wednesday, July 17, 2019, 17:49 [IST]
Other articles published on Jul 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X