న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: యశస్వి జైస్వాల్ నుంచి సాయి కిశోష్ వరకు, వేలంలో యువ ఆటగాళ్లు వీరే!

Yashasvi Jaiswal to Ravisrinivasan Sai Kishore – Five Players Mumbai Indians Will Target During Players’ Auction

హైదరాబాద్: డిసెంబర్ 19(గురువారం) నాడు కోల్‌కతా వేదికగా ఐపీఎల్ 2020 వేలం జరగనుంది. ఈ వేలం కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే 332 మందితో తుది జాబితాను టోర్నీ నిర్వాహాకులు సిద్ధం చేశారు. వేలంలో పాల్గొనే మొత్తం ఎనిమిది ప్రాంచైజీలు 73 మందిని ఎంపిక చేసుకోనున్నారు.

ఇందులో 29 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఉంది. దేశవాళీల్లో సత్తాచాటుతున్న యువ ఆటగాళ్లను గుర్తించేందుకు ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి ముందే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహించారు. దీంతో వచ్చే సీజన్ కోసం జరగనున్న ఐపీఎల్ వేలంలో ఫ్రాంఛైజీలు యువ ఆటగాళ్ల వైపు మొగ్గుచూపే అవకాశముంది.

50 నిమిషాల్లోనే!: మాజీ ఫార్ములా వన్ బాస్ కుమార్తె ఇంట్లో భారీ దొంగతనం50 నిమిషాల్లోనే!: మాజీ ఫార్ములా వన్ బాస్ కుమార్తె ఇంట్లో భారీ దొంగతనం

ఐపీఎల్ 2020 వేలం బరిలో ఉన్న ఆ యువ ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి పరిశీలిద్దాం...

యశస్వి జైస్వాల్ (కనీస ధర: రూ. 20 లక్షలు)

యశస్వి జైస్వాల్ (కనీస ధర: రూ. 20 లక్షలు)

ఏడాది కాలంగా దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. 17 ఏళ్ల యశస్వీ జైస్వాల్ విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించాడు. ఈ ప్రదర్శనే అండర్-19 ప్రపంచకప్‌లో అతడికి చోటు దక్కేలా చేసింది. అంతేకాదు అతి పిన్న వయసులో లిస్ట్ ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీ బాదిన యశస్వి.. ఈ సీజన్‌లో 112.80 సగటుతో 564 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.

ప్రియం గార్గ్ (కనీస ధర: రూ. 20 లక్షలు)

ప్రియం గార్గ్ (కనీస ధర: రూ. 20 లక్షలు)

అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న ప్రియం గార్గ్ కోసం ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీ 10 మ్యాచ్‌ల్లో 814 పరుగులు చేశాడు. 12 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 867 రన్స్‌తో సత్తాచాటాడు. దీంతో ప్రియం గార్గ్‌పై పలు ప్రాంఛైజీలు కన్నేశాయి.

విరాట్ సింగ్ (కనీస ధర: రూ. 20 లక్షలు)

విరాట్ సింగ్ (కనీస ధర: రూ. 20 లక్షలు)

జార్ఖండ్‌కు చెందిన ఈ యువ ఆటగాడు దేశవాళీల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది ముస్తాక్ అలీ టోర్నీలో 57.17 సగటుతో 343 పరుగులు చేసిన విరాట్.. విజయ్ హజారే ట్రోఫీలో 100కు పైగా స్ట్రయిక్ రేట్‌తో 335 పరుగులు చేశాడు. జార్ఖండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దేవధర్ ట్రోఫీలో మంచి ప్రదర్శనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.

రోహన్ కదం (కనీస ధర: రూ. 20 లక్షలు)

రోహన్ కదం (కనీస ధర: రూ. 20 లక్షలు)

కర్ణాటక జట్టు వరుసగా రెండోసారి ముస్తాక్ అలీ ట్రోఫీ కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో 129.78 సగటుతో 536 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రోహన్ కదంపై కూడా పలు ప్రాంఛైజీలు కన్నేశాయి.

సాయి కిషోర్ (కనీస ధర: రూ. 20 లక్షలు)

సాయి కిషోర్ (కనీస ధర: రూ. 20 లక్షలు)

తమిళనాడుకు చెందిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్‌కు గతే ఐపీఎల్లోనే చోటు దక్కాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ ఏడాది మరింత నిలకడగా బౌలింగ్ చేసిన అతడు ముస్తాక్ అలీ టోర్నీలో 4.63 ఎకానమీతో 20 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో తమిళనాడు జట్టు ఫైనల్‌కు చేరడంలో కిషోర్ కీలక పాత్ర పోషించాడు.

Story first published: Tuesday, December 17, 2019, 14:47 [IST]
Other articles published on Dec 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X