న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ జట్టులో రవి, త్యాగి, యశస్వి.. బంగ్లా సారథికి కెప్టెన్‌ బాధ్యతలు!!

Yashasvi Jaiswal, Ravi Bishnoi, Kartik Tyagi named in ICC U19 World Cup Team of the Tournament

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులో భారత్‌ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. టోర్నీలో అత్యధిక పరుగులు (400) చేసిన స్టార్ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, అత్యధిక వికెట్లు (17) తీసిన లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌తో పాటు పేసర్‌ కార్తీక్‌ త్యాగి ఐసీసీ జట్టులో చోటు దక్కించుకున్నారు.

<strong>టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్.. జాదవ్ ఔట్.. పాండే ఇన్!!</strong>టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్.. జాదవ్ ఔట్.. పాండే ఇన్!!

 కెప్టెన్‌గా అక్బర్‌ అలీ:

కెప్టెన్‌గా అక్బర్‌ అలీ:

బంగ్లాదేశ్‌ సారథి అక్బర్‌ అలీ ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు నాయకత్వ బాధ్యతల్ని దక్కించుకున్నాడు. భారత్‌, బంగ్లాదేశ్‌ నుంచి ముగ్గురేసి ఆటగాళ్లు ఐసీసీ జట్టులో చోటు దక్కించుకున్నారు. బంగ్లా కెప్టెన్‌తో పాటు హషదత్‌ హొసేన్‌, మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ అవకాశం పొందారు. వెస్టిండీస్‌, ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ఇద్దరేసి ఆటగాళ్లు, శ్రీలంక నుంచి ఒకరు ఐసీసీ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక కెనడాకు చెందిన అఖిల్‌ కుమార్‌ పన్నెండో ఆటగాడిగా ఎంపికయ్యాడు.

రవి బిష్ణోయ్‌ రికార్డు:

రవి బిష్ణోయ్‌ రికార్డు:

అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో 88 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. టోర్నీలో యశస్వి ఒక శతకం, నాలుగు అర్ధ శతకాలు చేసాడు. రవి బిష్ణోయ్‌ ఆరు మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసాడు. ప్రపంచకప్‌లో రవి టీమిండియా తరఫున ఓ రికార్డు సృష్టించాడు. 17 వికెట్లతో ఈ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇక కార్తీక్‌ త్యాగి 11 వికెట్లతో రాణించాడు.

ఫైనల్లో భారత్ ఓటమి:

ఫైనల్లో భారత్ ఓటమి:

ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో బంగ్లా తొలిసారి ప్రపంచకప్‌ అందుకొని చరిత్ర సృష్టించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. తొలిసారి అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడుతున్న బంగ్లాదేశ్‌ చివరివరకు పోరాడి మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

ఐసీసీఅండర్‌-19 ప్రపంచకప్‌ జట్టు:

ఐసీసీఅండర్‌-19 ప్రపంచకప్‌ జట్టు:

యశస్వి జైశ్వాల్‌ (భారత్‌), ఇబ్రహీం జద్రాన్‌ (అఫ్గానిస్థాన్‌), రవిండు రసంత (శ్రీలంక), మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ (బంగ్లా), షహదత్‌ హోసేన్‌ (బంగ్లా), నయీం యంగ్‌ (వెస్టిండీస్‌), అక్బర్‌ అలీ (బంగ్లా.. కీపర్‌,కెప్టెన్‌), షఫీకుల్లా ఘఫారీ (అఫ్గానిస్థాన్‌), రవిబిష్ణోయ్‌ (భారత్), కర్తీక్‌ త్యాగి (భారత్‌), జయ్‌డెన్‌ సీల్స్‌ (వెస్టిండీస్‌), అకిల్‌ కుమార్‌ (కెనెడా).

Story first published: Tuesday, February 11, 2020, 8:46 [IST]
Other articles published on Feb 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X