న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్ చేరాలంటే ఎలా..? ఏ జట్టుకు ఎలాంటి అవకాశాలున్నాయి?

World test championship scenario

దక్షిణాఫ్రికాపై 2-1తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ గెలిచాక 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పోరు రసవత్తరంగా సాగుతోంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా తన రెండో స్థానంలో మరింత విన్నింగ్ పర్సంటేజీని కోల్పోయింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను సంక్లిష్టం చేసుకుంది. ఈ సిరీస్ అనంతరం వచ్చే ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించేందుకు మొత్తం ఆరు జట్లు పోటీలో ఉన్నాయి. ఈ ఆరు జట్ల ఫైనల్ అవకాశాలను ఓసారి పరిశీలిస్తే..

1. ఆస్ట్రేలియా : ప్రస్తుతం టేబుల్లో నంబర్ 1 స్థానం, 70% విన్నింగ్ పర్సంటేజీ

మిగిలిన టెస్ట్ మ్యాచ్‌లు: వెస్టిండీస్‌తో (2‌టెస్టులు స్వదేశంలో), దక్షిణాఫ్రికాతో (3టెస్టులు స్వదేశంలో), భారత్‌తో (4 టెస్టులు విదేశంలో),

దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ చేతిలో సిరీస్ ఓడిపోవడం ఆస్ట్రేలియాకు బాగా కలిసొచ్చింది. ఆ జట్టు అగ్రస్థానంలో మరింత పదిలమైంది. ఆసీస్‌కు ఇంకా తొమ్మిది మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అందులో భారత పర్యటనలో భాగంగా నాలుగు మ్యాచ్‌లు ఆసీస్ ఆడనుంది. ఇది ఆస్ట్రేలియాకు అతి పెద్ద సవాల్. ఆస్ట్రేలియా ఐదు హోమ్ టెస్టుల్లో గెలిచినా.. భారత్‌‌తో నాలుగింటిలో ఓడిపోతే.. వారి విజయ శాతం 63.16కి పడిపోతుంది. అదే జరిగితే భారత్ బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులను కూడా గెలిస్తే ఆస్ట్రేలియాను అధిగమించి తొలి స్థానానికి వస్తుంది. అయితే ఆస్ట్రేలియా తమ విజయ శాతాన్ని 68.42గా చేసుకుంటే బెర్త్ ఖాయమవుతుంది. రాబోయే 9 మ్యాచ్‌లలో ఆరింటిలో ఆ జట్టు గెలవాలి.

2. దక్షిణాఫ్రికా : 60% (విన్నింగ్ పర్సంటేజీ)

2. దక్షిణాఫ్రికా : 60% (విన్నింగ్ పర్సంటేజీ)

మిగిలిన మ్యాచ్‌లు: ఆస్ట్రేలియాతో (3 విదేశంలో), వెస్టిండీస్‌తో (రెండు స్వదేశంలో).

దక్షిణాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అయితే ఆ జట్టు ఫైనల్ చేరడానికి అవకాశాలున్నా.. కాస్త టఫ్ పరిస్థితులను ఆ జట్టు ఎదుర్కోవాలి. చివరి ఐదు మిగిలిన టెస్ట్‌లలో నాలుగింటిని గెలిస్తే ఆ జట్టు విజయ శాతం 66.67కి చేరుకుంటుంది. తద్వారా ఫైనల్ చేరడానికి భారత్, పాకిస్థాన్ ముప్పునుంచి తప్పించుకునే వీలుంది.

3. శ్రీలంక: 53.33% విన్నింగ్ పర్సంటేజీ

3. శ్రీలంక: 53.33% విన్నింగ్ పర్సంటేజీ

మిగిలిన మ్యాచ్‌లు : న్యూజిలాండ్ (2 విదేశంలో)

న్యూజిలాండ్‌ పర్యటనలో 2 టెస్టులు శ్రీలంక గెలవడం అంత సులభం కాదు. ఒకవేళ మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలిచినప్పటికీ.. ఆ జట్టు విజయ శాతం 61.11కి మాత్రమే చేరుతుంది. ఆ పర్సంటేజీ ఫైనల్ చేరడానికి సరిపోదు.

4. భారత్: 52.08% విన్నింగ్ పర్సంటేజీ

4. భారత్: 52.08% విన్నింగ్ పర్సంటేజీ

మిగిలిన మ్యాచ్‌లు: బంగ్లాదేశ్‌తో (2 విదేశంలో), ఆస్ట్రేలియాతో (3 స్వదేశంలో).

పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న భారత్ వరుసగా రెండో సారి ఫైనల్‌కు అర్హత సాధించేందుకు అవకాశాలున్నాయి. భారత్ మిగిలిన ఆరు టెస్ట్ మ్యాచ్‌లు గెలిస్తే జట్టు విజయ శాతం 68.06కి చేరుకుని నేరుగా ఫైనల్ చేరొచ్చు. అయితే ఒకట్రెండు ఓడిపోతే మాత్రం జట్టు మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆసీస్‌తో నాలుగు స్వదేశీ టెస్టులు ఆడుతున్నందున.. ఆసీస్‌పై 4-0తో గెలవడం అంత ఈజీ కాదు.

5. పాకిస్థాన్: 51.85%

5. పాకిస్థాన్: 51.85%

మిగిలిన మ్యాచ్‌లు: ఇంగ్లాండ్‌తో (3 స్వదేశంలో), న్యూజిలాండ్‌తో (2 స్వదేశంలో)

పాకిస్థాన్‌కు ఇంకా ఐదు టెస్టులు మిగిలి ఉన్నాయి. బాబర్ ఆజాం సారథ్యంలోని పాక్ జట్టు ఐదు మ్యాచ్‌లలో గెలిస్తే వారి విజయ శాతం 69.05కి చేరుకుంటుంది. తద్వారా నేరుగా ఫైనల్ చేరుకోవచ్చు. అయితే ఒక్క మ్యాచ్ ఓడినా ఆ జట్టు విన్నింగ్ పర్సంటేజీ ఘోరంగా పడుతుంది. నాలుగు మ్యాచ్‌లే గెలిస్తే 61.9కి విన్నింగ్ పర్సంటేజీ పడిపోయి.. ఇక ఫైనల్ అవకాశాలు చేజారుతాయి. కాబట్టి ప్రతి మ్యాచ్ పాక్ గెలవాల్సిందే. ఒకవేళ పాక్ అన్నీ గెలిచి.. భారత్ కూడా అన్నీ గెలిచిందనుకో అప్పుడు ఈ రెండు జట్లు ఫైనల్ చేరుతాయి. అదే జరిగితే WTCలో ఇండో-పాక్ ఫైనల్‌ను మనం చూడవచ్చు.

6. వెస్టిండీస్: 50% విన్నింగ్ పర్సంటేజీ

6. వెస్టిండీస్: 50% విన్నింగ్ పర్సంటేజీ

మిగిలిన సిరీస్‌లు: ఆస్ట్రేలియాతో (2 విదేశంలో), దక్షిణాఫ్రికాతో (2 విదేశంలో)

వెస్టిండీస్ నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే 65.38విజయ శాతాన్ని చేరుకోగలదు కానీ అందుకు ఆస్ట్రేలియాను, అలాగే దక్షిణాఫ్రికాను ఆయా దేశాల్లో ఓడించాలి. ఇది దాదాపు కష్టమే కాబట్టి వెస్టిండీస్ ఫైనల్ రేసులో ఉండే అవకాశం లేదు.

ఇకపోతే 7.ఇంగ్లండ్ (38.6శాతం), 8.న్యూజిలాండ్ (25.93శాతం), 9.బంగ్లాదేశ్ (13.33శాతం)లు ఫైనల్ రేసులో లేవు. కానీ ఈ జట్లు ఇతర జట్ల అవకాశాలను దెబ్బతీసేందుకు వీలుంది. బంగ్లాదేశ్‌తో భారత్‌తో తలపడనుండగా, ఇంగ్లాండ్ పాకిస్థాన్‌తో తలపడనుంది. న్యూజిలాండ్ పాకిస్థాన్, శ్రీలంకతో తలపడనుంది.

Story first published: Wednesday, September 14, 2022, 11:15 [IST]
Other articles published on Sep 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X