న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంగూలీ లేకుంటే నా స్నేహితుల మాదిరి కెనడాలో స్థిరపడేవాడిని: హర్భజన్

‘Would’ve been in Canada if it wasn’t for Sourav Ganguly,’ Harbhajan narrates story of Test comeback

హైదరాబాద్: 417 టెస్టు వికెట్లు- ఓ భారత ఆఫ్ స్పిన్నర్ తీసిన అత్యధిక వికెట్లు, 269 వన్డే వికెట్లు - భారత స్పిన్నర్ తీసిన రెండో అత్యధికం. టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్రాక్ రికార్డు ఇది. అంతేకాదు
టీమిండియా 2007, 2011 ప్రపంచకప్‌ జట్లలో కీలక సభ్యుడు కూడా.

భారత్ తరుపున చివరగా 2016లో టీ20 ఆడిన హర్భజన్ సింగ్... అప్పటి కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లేకపోతే 2000లోనే తన కెరీర్‌ ముగిసిపోయేదని చెప్పుకొచ్చాడు. 'దాదాగిరి' అనే ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న హర్భజన్ సింగ్ 2001 నాటి అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

'ముందుగా నా భార్యతో మాట్లాడాలి.. ఆమె ఒప్పుకుంటే ప్రపంచకప్‌ ఆడుతా''ముందుగా నా భార్యతో మాట్లాడాలి.. ఆమె ఒప్పుకుంటే ప్రపంచకప్‌ ఆడుతా'

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో చోటు కల్పించి దాదా తనకు కొత్త జీవితాన్ని ఇచ్చాడని భజ్జీ తెలిపాడు. ఈ సందర్భంగా భజ్జీ మాట్లాడుతూ "నన్ను చాలా రోజులు పక్కన పెట్టారు. ఆ సిరీస్‌కు ముందు నన్ను జాతీయ క్రికెట్ ఆకాడమీ నుంచి తప్పించారు. చాలా కుంగిపోయాను. నాటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ లేకపోతే, నేను కూడా నా స్నేహితుల మాదిరిగా నేను కూడా కెనడాలో స్థిరపడ్డాను" అని అన్నాడు.

కెరీర్‌ మొత్తం నాకు అండగా

కెరీర్‌ మొత్తం నాకు అండగా

"కెరీర్‌ మొత్తం నాకు అండగా నిలిచినందుకు గంగూలీకి కృతజ్ఞతలు. ఆ సిరిస్‌లో నాకు మరో అవకాశం లేదు. నేను గనుక వికెట్లు తీయకుంటే టీమిండియా తరుపున అదే నా చివరి సిరీస్ అయ్యేది" అని భజ్జీ వెల్లడించాడు. లెగ్‌స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే 2001లో ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌కు ముందు గాయపడడంతో హర్భజన్‌‌ను ఎంపిక చేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు

తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు

ముంబైవ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన హర్భజన్ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన రెండో టెస్టులో అత్యుత్తుమ ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ తీశాడు. ఫలితంగా టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.

అది నమ్మశక్యం కాని సందర్భం

అది నమ్మశక్యం కాని సందర్భం

"అది నమ్మశక్యం కాని సందర్భం. నా జీవితంలో 2007, 2011 ప్రపంచకప్‌లు గెలవడమే అత్యుత్తమ సందర్భాలు. అయితే, ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్‌ సాధించడం మాత్రం చాలా ప్రత్యేకం. ఆ సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు ఆటగాళ్లంతా అది తమ హ్యాట్రిక్‌గా భావించారు. రాహుల్‌ ద్రవిడ్‌ అంతలా సెలబ్రేట్‌ చేసుకోవడం అప్పుడే తొలిసారి చూశాను. అది నా హ్యాట్రిక్‌ కాదు, జట్టుదే" అని హర్భజన్ అన్నాడు.

171 పరుగులతో టీమిండియా ఘన విజయం

171 పరుగులతో టీమిండియా ఘన విజయం

ఆ మ్యాచ్‌లో ఫాలోఆన్‌ ఆడిన భారత్‌ 171 పరుగులతో ఘన విజయం సాధించింది. వీవీఎస్‌ లక్ష్మణ్‌ 281 పరుగులతో కెరీర్‌ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడు. హర్భజన్ సింగ్ 13 వికెట్లు((7/123 & 6/73)) తీయగా.... ఆ సిరిస్‌లో మొత్తంలో 32 వికెట్లు పడగొట్టాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది.

Story first published: Thursday, January 16, 2020, 12:40 [IST]
Other articles published on Jan 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X