ప్రపంచం మీ ఏడుపుని కోరుకుంది?: ఆసీస్ ఆటగాళ్లపై అశ్విన్ సానుభూతి

Posted By:
World simply wants to see you cry: R Ashwin gets philosophical after Steve Smiths breakdown

హైదరాబాద్: బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాది పాటు నిషేధానికి గురైన అనంతరం స్వదేశానికి చేరుకున్న స్టీవ్ స్మిత్ సిడ్నీ విమానాశ్రయంలో మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో 'నేను ఎవరినీ నిందించడం లేదు. గత శనివారం ఏదైతే జరిగిందో అందుకు కెప్టెన్‌గా జరిగిన పరిణామాలకు నాదే పూర్తి బాధ్యత. నాయకుడిగా నేను పూర్తిగా విఫలం అయ్యా' అని స్మిత్ కన్నీటి పర్యంతం అయ్యాడు.

భావోద్వేగానికి గురైన ధోనీ, రెండేళ్ల నిషేదం పునరాగమనం గురించి..

ఆ తర్వాత స్మిత్‌పై క్రికెట్‌ ప్రపంచం నుంచి సానుభూతి ప్రదర్శిస్తోంది. అంతేకాదు బాల్ టాంపరింగ్ ఘటనలో క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన శిక్ష తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఆస్ట్రేలియా ఆటగాళ్లపై టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన సానుభూతిని వ్యక్తం చేశాడు.

'ప్రపంచం మీ ఏడుపును కోరుకుంది. మీరు ఏడ్చారు కదా. ఇక వారంతా సంతృప్తి చెందారు. ప్రశాంతంగా జీవిస్తారు. ఈ ఘటన నుంచి బయటపడే శక్తిని ఆ దేవుడు మీకివ్వాలి అని స్టీవ్ స్మిత్‌, కామెరూన్ బెన్‌ క్రాప్ట్‌, డెవిడ్‌ వార్నర్‌లను ఉద్దేశించి' అశ్విన్ ట్వీట్ చేశాడు.

మరో ట్వీట్‌లో 'వార్నర్‌కు ఈ ఘటనను ఎదర్కునే శక్తి కావాలి. వారి దేశ ఆటగాళ్ల యూనియన్‌ నుంచి అతనికి మద్దతు లభిస్తోందని ఆశిస్తున్నా' అని పేర్కొన్నాడు. కాగా, బాల్ టాంపరింగ్ ఘటనపై తమ తప్పుని అంగీకరిస్తూ స్టీవ్ స్మిత్, బాన్‌క్రాప్ట్, డేవిడ్ వార్నర్‌లు శ్చాతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

బాల్ టాంపరింగ్ ఘటనలో క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన శిక్ష తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. బాల్ టాంపరింగ్ వివాదంతో స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లు ప్రపంచ క్రికెట్ ముందు దోషులుగా నిలబడటంతో పాటు చెడ్డపేరు తెచ్చుకున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా వీరిపై కఠినంగా చర్య తీసుకుంది.

స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించగా... బాన్‌క్రాప్ట్‌పై 9 నెలల పాటు నిషేధం విధించింది. దీంతో పాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. ఈ వివాదానికి సూత్రధారి అయిన డేవిడ్‌ వార్నర్‌ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌కు ఒకింత ఊరటనిచ్చింది.

ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ రెండేళ్ల కాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని పేర్కొంది. అయితే, ఆ తర్వాత క్రికెట్‌ అభిమానుల నుంచి, అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది.

స్మిత్‌కు నా సానుభూతిని తెలుపుతున్నా..: డుప్లెసిస్

క్రికెట్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా వీరు క్లబ్‌ క్రికెట్‌ ఆడుకునేందుకు అనుమతించింది. మరోవైపు బాల్ టాంపరింగ్ వివాదంలో హెడ్ కోచ్ డారెన్ లీమన్ పాత్ర లేదని క్రికెట్ ఆస్ట్రేలియా క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ, కోచ్ పదవికి డారెన్ లీమన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిజానికి 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరిగే యాషెస్ సిరీస్ వరకు లీమన్ పదవిలో ఉండాల్సి ఉంది.

అయితే ఈ బాల్ టాంపరింగ్ వివాదం వల్ల ముందుగానే కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుకు కొత్త కోచ్‌ని వెతికే పనిలో పడింది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రయత్నాలను కూడా మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా కోచ్ రేసులో జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్, జాసన్ గిలెస్పీ, డేవిడ్ సాకర్, టామ్ మూడీలు ఉన్నారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, March 30, 2018, 16:16 [IST]
Other articles published on Mar 30, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి