న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

490/4: వన్డేల్లో న్యూజిలాండ్ ప్రపంచ రికార్డు

By Nageshwara Rao
World Record: New Zealand women score mammoth 490/4 vs Ireland, highest ever in ODIs

హైదరాబాద్: మహిళల వన్డే క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ రికార్డుని న్యూజిలాండ్ మహిళల జట్టు నెలకొల్పడం విశేషం. ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు చేసింది. దీంతో గతంలో తమ పేరిటే ఉన్న 455/5 పరుగుల (1997లో పాకిస్తాన్‌పై) అత్యధిక స్కోరు రికార్డును న్యూజిలాండ్ బద్దలు కొట్టింది.

పురుషుల, మహిళల క్రికెట్‌లో కూడా ఇదే రికార్డు. 2016లో పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ పురుషుల జట్టు చేసిన 444/3 స్కోరును కూడా ఈ సందర్భంగా అధిగమించింది. మహిళల వన్డేల్లో రెండు సార్లు న్యూజిలాండ్‌ 400 పరుగులు దాటగా, ఆస్ట్రేలియా మాత్రమే ఒక సారి (412/3) ఈ ఘనత సాధించింది. ఇక, పురుషుల్లో మాత్రం 18సార్లు వివిధ జట్లు ఈ ఫీట్‌ను అందుకున్నాయి.

సెంచరీల మోత

న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలతో సత్తా చాటగా, మరో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. కివీస్ కెప్టెన్ సుజీ బేట్స్ (94 బంతుల్లో 151; 24 ఫోర్లు, 2 సిక్సర్లు), మాడీ గ్రీన్ (77 బంతుల్లో 121; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో హోరెత్తించగా, అమెలియా కెర్ (45 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), వాట్కిన్ (59 బంతుల్లో 62; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.

టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం 64 ఫోర్లు, 7 సిక్సర్లు నమోదు కాగా... ఐర్లాండ్‌ ఎక్స్‌ట్రాల రూపంలో 33 పరుగులు సమర్పించుకుంది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 35.3 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. డెలానీ (37), గ్రే (35) మినహా అందరు విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది.

71 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన బేట్స్

ఓపెనర్లు బేట్స్, వాట్కిన్‌ జట్టు ఇన్నింగ్స్‌ను సాధారణంగానే ప్రారంభించినా ఆ తర్వాత దూకుడుగా ఆడారు. 40 పరుగుల వద్ద క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన బేట్స్‌ ఆ తర్వాత చెలరేగి 71 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. 172 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం తర్వాత వాట్కిన్‌ ఔటైంది. ఆ తర్వాత కారా ముర్రే ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్‌ బాదిన అనంతరం ఎట్టకేలకు అదే ఓవర్లో బేట్స్‌ పెవిలియన్‌కు చేరింది.

62 బంతుల్లోనే గ్రీన్‌ సెంచరీ

అనంతరం 62 బంతుల్లోనే గ్రీన్‌ సెంచరీని పూర్తి చేసుకుంది. 48 ఓవర్లో కెర్‌ 2 భారీ సిక్సర్లు బాదడంతో స్కోరు 467 పరుగులకు చేరింది. చివరి 2 ఓవర్లలో 33 పరుగులు చేస్తే కివీస్‌ స్కోరు 500 పరుగులు చేరుతుందని భావించినప్పటికీ, 49వ ఓవర్లో 4, ఆఖరి ఓవర్లో 4 ఫోర్లు సహా 19 పరుగులు మాత్రమే వచ్చాయి. మూడు వన్డేల ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తర్వాతి మ్యాచ్‌ ఆదివారం జరగనుంది.

Story first published: Saturday, June 9, 2018, 10:26 [IST]
Other articles published on Jun 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X