న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంఫైర్‌తో వాగ్వాదం: జోఫ్రా, రాయ్‌లకు జరిమానా.. పాక్ కెప్టెన్‌కు కూడా!

World Cup: Jofra Archer, Jason Roy fined for showing dissent towards umpire

హైదరాబాద్: అంఫైర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను ఇంగ్లాండ్‌ క్రికెటర్లు జాసన్ రాయ్, జోఫ్రా ఆర్చర్‌లకు ఐసీసీ జరిమానా విధించింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో జాసన్ రాయ్ మిస్ ఫీల్డింగ్ అనంతరం అంఫైర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో జాసన్ రాయ్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇదే మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇంగ్లాండ్‌ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు 15శాతం జరిమానా పడింది. వీరిద్దరికీ జరిమానాతో పాటు చెరో డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ జత చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ రిఫ‌రీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

మరోవైపు నిర్ణీత సమయం కన్నా ఒక ఓవర్‌ను ఆలస్యంగా వేసినందుకు పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు కూడా మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. స్లో ఓవర్‌రేట్ కారణంగా సర్ఫరాజ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు జట్టులోని మిగతా ఆటగాళ్లకు తమ మ్యాచ్ ఫీజుల్లో 10 శాతం జరిమానా విధించారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. అనంతరం 349 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆతిథ్య జట్టు 14 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Story first published: Tuesday, June 4, 2019, 17:18 [IST]
Other articles published on Jun 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X