న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా కెరీర్లో బెస్ట్, వరస్ట్ రోజు అదే: ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పై గుప్టిల్ భావోద్వేగ పోస్ట్

World Cup final was both the best and worst day of my cricketing life: Martin Guptill

హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఒకరిని హీరోని చేస్తే... మరొకరిని విలన్‌ని చేసింది. హీరో(బెన్ స్టోక్స్) ఎవరో మీకు అర్ధమయ్యే ఉంటుంది... విలన్ విషయానికి వస్తే మార్టిన్ గుప్టిల్. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలవడంతో మైదానంలోనే కుప్ప‌కూలిన గ‌ప్తిల్ చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయాడు.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

ఎంత మంది ఓదార్చినా త‌న భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక‌పోయాడు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ రోజున త‌న‌కు మంచి, చెడు అనుభ‌వాలు ఎదుర‌య్యాయ‌ని మార్టిన్ గుప్టిల్ అన్నాడు. తాజాగా, ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గురించి మార్టిన్ గ‌ుప్టిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశాడు.

లార్డ్స్‌లో అద్భుత‌ ఫైన‌ల్ మ్యాచ్

"లార్డ్స్‌లో అద్భుత‌ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగి వారం రోజులు పూర్త‌యిందంటే న‌మ్మ‌లేక‌పోతున్నా. నా క్రికెట్ కెరీర్‌లోనే ఉత్త‌మ‌మైన‌, చెత్త రోజు అది. విభిన్న‌మైన భావోద్వేగాల‌కు గుర‌య్యా. అయితే న్యూజిలాండ్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించడం... బ్లాక్ క్యాప్స్ లాంటి గొప్ప ఆటగాళ్లతో ఆడటాన్ని చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నా. మ‌ద్ద‌తుగా నిలిచిన అంద‌రికీ ధ‌న్య‌వాదాల‌ు" అని గుప్టిల్ పోస్టు పెట్టాడు.

ఈ ప్రపంచకప్‌లో నిరాశ పరిచిన గుప్టిల్

ఈ ప్రపంచకప్‌లో నిరాశ పరిచిన గుప్టిల్

2015 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మార్టిన్ గుప్టిల్ ఈ ప్రపంచకప్‌లో మాత్రం తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. అయితే, టీమిండియాతో జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌లో అత్యంత కీల‌క స‌మ‌యంలో ధోనీని ర‌నౌట్ చేసి కివీస్ ఫైన‌ల్‌కు చేర‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. లార్డ్స్ వేదికగా జులై 14న న్యూజిలాండ్-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీ రూల్ ఆధారంగా ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.

మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు

మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు

ఆఖరి ఓవర్‌లో ఇంగ్లాండ్‌ విజయానికి మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మార్టిన్ గప్టిల్‌ విసిరిన త్రో అనూహ్యంగా బెన్‌స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ తీసిన రెండు పరుగులతోపాటు ఓవర్‌ త్రో వల్ల అదనంగా మరో నాలుగు పరుగులు ఆ జట్టుకు కలిసివచ్చాయి.

ఓవర్ త్రో కారణంగా

ఓవర్ త్రో కారణంగా

ఈ ఓవర్ త్రో కారణంగా మ్యాచ్ ఫలితమే తారుమారైంది. ఈ పరుగుల కారణంగా తొలుత ఇరు జట్లు ప్రధాన స్కోరు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితం నిర్ణయించేందుకు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. సూపర్‌ ఓవర్‌లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఆతిథ్య జట్టైన ఇంగ్లాండ్‌ను ఐసీసీ విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, July 23, 2019, 14:43 [IST]
Other articles published on Jul 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X