న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'లంకత్ జరిగే మ్యాచ్‌లో జడేజాను తీసుకోని ప్రయోగం చేయండి'

ICC Cricket World Cup 2019 : Harbhajan Singh Wants India To Include Jadeja In Sri Lanka Match
World Cup 2019: Harbhajan Singh bats for Ravindra Jadejas inclusion in India playing XI

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. శనివారం జరగనున్న ఈ మ్యాచ్‌కు లీడ్స్ ఆతిథ్యమిస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు తుది జట్టులో చోటు కల్పించాలని వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సూచించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌కు టీమిండియాకు ఎంపికైన 15మంది జాబితాలో రవీంద్ర జడేజా కూడా చోటు దక్కింది. కానీ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా అతనికి ఆడే అవకాశం రాలేదు. అయితే ఇంగ్లడ్‌తో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చిన జడేజా తన మెరుపు పీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు.

మరోవైపు టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లో ఆల్ రౌండర్ జడేజాకు చోటు కల్పిస్తే బాగుంటుందని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. మిడిల్‌ ఓవర్లలో అద్భుత బౌలింగ్‌ వేయడంతో పాటు, డెత్‌ ఓవర్లలో బ్యాట్‌తోనూ పరుగులు సాధించే అవకాశం ఉందని భజ్జీ అన్నాడు.

భజ్జీ మాట్లాడుతూ "శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లో రవీంద్ర జడేజాను తీసుకుంటే చూడాలని ఉంది. అతడు 6, 7 లేదా 8 ఓవర్లు బౌలింగ్ వేయగలడు. బంతితో ఎవరైనా రాణించలేకపోతే... భజ్జీ కనీసం 6 లేదా 7 ఓవర్లు అద్భుతంగా వేయగలడు" అని అన్నాడు. గత కొంతకాలంగా టెస్టుల్లో మంచి ప్రదర్శన చేస్తోన్న జడేజా... కుల్దీప్, చాహల్ రాకతో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో చోటు కోల్పోయాడు.

శనివారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు కూడా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను దక్షిణాఫ్రికా ఓడిస్తే గనుక టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఒకవేళ ఆసీస్‌ గెలిస్తే 16 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది.

Story first published: Friday, July 5, 2019, 15:57 [IST]
Other articles published on Jul 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X