న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెప్పినవీ ఏమీ జరగలేదు: ప్రపంచకప్‌లో 500 పరుగులు అందని ద్రాక్షలాగే!

World Cup 2019 going whose way? Neither teams have scored 500, nor bowlers have taken early wickets

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ ప్రపంచకప్‌కు ముందు క్రికెట్ విశ్లేషకులు రెండు గ్రూపులుగా విడిపోయి తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో మొదటి గ్రూపు ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు 500 పరుగుల మైలురాయిని అందుకుంటాయని అన్నారు.

సీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇక, రెండో గ్రూప్ విషయానికి వస్తే ఇంగ్లీషు పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయని ఫాస్ట్ బౌలర్లు తమ స్వింగ్ బంతులతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్లను ఇబ్బండి పెడతారని చెప్పుకొచ్చారు. మంగళవారంతో ఈ మెగా టోర్నీ 27 రోజులు పూర్తి చేసుకుంది. అయితే, ఈ రెండు కూడా ఏ ఒక్క విషయం కూడా ఇప్పటివరకు జరగకపోవడం విశేషం.

ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు 397

ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు 397

ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు 397. పసికూన ఆప్ఘనిస్థాన్‌పై ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ నమోదు చేసింది. ఇక, ఈ ప్రపంచకప్‌లో ఓపెనర్ల యావరేజి భాగస్వామ్యం 44.36గా నమోదైంది. 1975లో జరిగిన ఆరంభ వరల్డ్‌కప్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ వరకు ఇదే అత్యుత్తమం.

బ్యాట్స్‌మెన్లకు మాత్రం అనుకూలంగా

బ్యాట్స్‌మెన్లకు మాత్రం అనుకూలంగా

అయితే, ఈ వరల్డ్‌కప్ బ్యాట్స్‌మెన్లకు మాత్రం అనుకూలంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే చాలా మ్యాచ్‌ల్లో 300కుపైగా స్కోర్లు నమోదయ్యాయి. అటు బ్యాట్స్ మెన్లు రెచ్చిపోతుంటే ఫాస్ట్ బౌలర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఏ ఫాస్ట్ బౌలర్ కూడా ఆశించిన స్థాయిలో మెరుపులు మెరిపించలేదు.

2011లో వరల్డ్‌కప్‌తో పోలిస్తే

2011లో వరల్డ్‌కప్‌తో పోలిస్తే

ఉపఖండంలో 2011లో ఆడిన వరల్డ్‌కప్‌తో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో బౌలర్లు ఏమంత తమ ప్రభావాన్ని చూపలేదనే చెప్పాలి. ఐసీసీ అధికారిక లెక్కల ప్రకారం ఈ ప్రపంచకప్‌లో ఫాస్ట్ బౌలర్లు వేసిన యావరేజి స్వింగ్ 0.649°. అదే 2007 వరల్డ్‌కప్‌లో 1.130 నమోదు కాగా, 2015 వరల్డ్‌కప్‌లో 0.993గా నమోదైంది.

టాస్ గెలిచిన ఏడుగురు కెప్టెన్లలో ఆరుగురు ఫీల్డింగ్‌కే

టాస్ గెలిచిన ఏడుగురు కెప్టెన్లలో ఆరుగురు ఫీల్డింగ్‌కే

ఇక, ఈ ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన ఏడుగురు కెప్టెన్లలో ఆరుగురు ఫీల్డింగ్‌వైపే మొగ్గు చూపారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టు కెప్టెన్ గుల్బదిన్ నైబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం టోర్నమెంట్ నాలుగో వారానికి చేరుకుంది. అయితే, ఇప్పుడు టాస్ గెలిచిన కెప్టెన్లు బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం.

Story first published: Tuesday, June 25, 2019, 19:03 [IST]
Other articles published on Jun 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X