న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్: సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్లేవో చెప్పిన అనిల్ కుంబ్లే

World Cup 2019: Anil Kumble, Kevin Pietersen pick semi-finalists for the tournament


హైదరాబాద్: తన ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తగా ఓడించి వరల్డ్‌కప్‌లోని మిగతా జట్లకు వెస్టిండిస్ గట్టి సందేశాన్ని పంపింది. వెస్టిండిస్ ఆరంభ మొదటి మ్యాచ్‌ని వీక్షించిన టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఈ మెగా టోర్నీలో ఆ జట్టు తప్పక సెమీఫైనల్‌కు వెళ్తుందని అభిప్రాయపడ్డాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

నిజానికి గతంలో రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండిస్ జట్టు ఈ వరల్డ్‌కప్‌కు అతికష్టం మీద అర్హత సాధించింది. గతేడాది మార్చిలో జింబాబ్వే వేదికగా నిర్వహించిన వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో ఆప్ఘనిస్థాన్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ మెగా టోర్నీలో 10వ జట్టుగా విండిస్ అర్హత సాధించింది.

1
43646

వెస్టిండిస్ గత ఘరిత్ర ఎంతో ఘనం. వరల్డ్‌కప్ ముందు వరకు ఆ జట్టు దీనస్థితిని చూసి ప్రతి ఒక్కరూ ఆందోళన చెందారు. అయితే, ఈ మెగా టోర్నీకి ముందు సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో ఆ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. టెస్టు సిరిస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన కరేబియన్లు... ఐదు వన్డేల సిరిస్‌ను 2-2తో సమం చేశారు.

ఆ తర్వాత ఐపీఎల్ 12వ సీజన్‌లో విండిస్ జట్టుకు చెందిన ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున ఆడిన ఆండ్రీ రస్సెల్ సూపర్ ఫామ్‌ను అందుకున్నాడు. ఇక, పంజాబ్ తరుపున ఆడిన క్రిస్ గేల్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో విండిస్ విజయాల్లో వీరిద్దరూ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తగా ఓడించడంలో వీరిదే ప్రధాన పాత్ర. బ్యాటింగ్‌లో క్రిస్ గేల్ హాఫ్ సెంచరీతో రాణించగా... రసెల్ కీలక సమయంలో వికెట్లు తీసి పాక్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.

దీంతో పాకిస్థాన్ 21.4 ఓవర్లకు 105 పరుగులకు కుప్పకూలింది. పాకిస్థాన్ ఏ దశలోనే విండీస్‌ పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో 106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ 13.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి అలవోక విజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే వెస్టిండిస్‌ను గెలుపు గుర్రంగా అభివర్ణించాడు. కుంబ్లే మాట్లాడుతూ "ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో పాటు గెలుపు గుర్రంగా వెస్టిండిస్ సెమీ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది" అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించాడు.

ఇక, గతంలో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లను సెమీఫైనలిస్ట్‌లుగా పేర్కొన్న ఇంగ్లాండ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్... శుక్రవారం నాటి మ్యాచ్‌లో వెస్టిండిస్ జోరుని చూసి పాకిస్థాన్ స్థానంలో వెస్టిండిస్ సెమీ‌ఫైనల్‌కు చేరుతుందని తెలిపాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా సెమీ పైనల్ రేసులో ఉందని పీటర్సన్ అన్నాడు.

Story first published: Saturday, June 1, 2019, 17:31 [IST]
Other articles published on Jun 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X