న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Women T20 World cup:టోర్నీకి ముందు ఆసీస్‌కు ఎదురు దెబ్బ...గాయాలతో టేలా ఔట్.. స్ట్రానోకు అవకాశం

Women T20 World cup:Aussie fast bowler Tayla Vlaeminck ruled out due to injury, Strano replaced

సిడ్నీ: మహిళల టీట్వంటీ ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ టేలా వ్లాయ్‌మిక్ గాయాలతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు టేలా గాయాలతో నిష్క్రమించడం బాధాకరమని టీమ్ మేనేజ్‌మెంట్ పేర్కొంది. శుక్రవారం రోజున భారత్‌తో జరగబోయే తొలి మ్యాచ్ మ్యాచ్ కోసం సాధన చేస్తున్న సమయంలో టేలా కుడి కాలుకు గాయమైంది. టేలా నిష్క్రమించడంతో ఆమె స్థానంలో ఆఫ్ స్పిన్నర్ మోలీ స్ట్రానో జట్టులో చేరతారని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

గాయపడిన ఆస్ట్రేలియా మహిళా ఫాస్ట్ బౌలర్ టేలా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నిందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అంతేకాదు అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో తన బౌలింగ్‌తో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందని ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ కోచ్ మాథ్యూ మాట్ చెప్పారు. విక్టోరియాకు చెందిన టేలా 21 ఏళ్లు.ఇలాంటి మెగా టోర్నీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోను నిష్క్రమించాలని ఎవరూ భావించరని చెప్పిన మాథ్యూ... గాయం నుంచి త్వరగా కోలుకుని జట్టులో చేరుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక గాయపడిన టేలా స్థానంలో వచ్చిన మరో యువ మహిళ స్ట్రానో కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో బాగా రానించిందని కోచ్ చెప్పారు. ఇప్పటి వరకు ఐదు అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడిన 27 ఏళ్ల స్ట్రానో ఏడు వికెట్లు తీసుకుంది. మహిళల బిగ్ బాష్ లీగ్‌లో స్ట్రానో అద్భుతంగా రానించిందని కోచ్ మాథ్యూ చెప్పారు. ఆ టోర్నీ మొత్తంలో అత్యధిక వికెట్లు తీసిన మహిళగా స్ట్రానో గుర్తింపు పొందింది. మహిళల బిగ్ బాష్ లీగ్‌లో స్ట్రానో 16.91 సగటుతో 24 వికెట్లు తీసింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు మహిళల టీట్వంటీ ప్రపంచ కప్ జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఢీకొంటుంది.

Story first published: Thursday, February 20, 2020, 10:37 [IST]
Other articles published on Feb 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X