న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ వరల్డ్ టీ20: భారత్ Vs కివీస్: షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్ ఇన్ఫో

ICC Women's World Cup T20 : India vs New Zealand
Womens World T20: India vs New Zealand: Preview, Indias schedule, timing, where to watch

గుయానా: ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌‌కు సర్వం సిద్ధమైంది. ఈ వరల్డ్ కప్‌కు కరేబియన్ దీవులు ఆతిథ్యమిస్తున్నాయి. టోర్నీలో భాగంగా శుక్రవారం(నవంబర్ 9) భారత్-న్యూజిలాండ్ మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకూ జరిగిన ఐదు మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఛాంపియన్లుగా కేవలం మూడు జట్లు మాత్రమే నిలిచాయి.

దేశం విడిచి వెళ్లిపో: అభిమాని పట్ల కోహ్లీ వ్యాఖ్యలను తప్పుబట్టిన భోగ్లేదేశం విడిచి వెళ్లిపో: అభిమాని పట్ల కోహ్లీ వ్యాఖ్యలను తప్పుబట్టిన భోగ్లే

అయితే, ఈ ఫార్మాట్‌లో భారత్ ఇప్పటివరకు మెరుగ్గా ఆడింది లేదు. దీంతో ఈసారి టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు భావిస్తోంది. 2009లో జరిగిన తొలి మహిళల టీ20 వరల్డ్ కప్‌ను చార్లెట్ ఎడ్వర్డ్స్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకుంది.

2016లో భారత్ వేదికగా జరిగిన టోర్నీ

2016లో భారత్ వేదికగా జరిగిన టోర్నీ

ఆ తర్వాత జరిగిన మూడు టోర్నీల్లోనూ ఆస్ట్రేలియా జట్టు హ్యాట్రిక్ టైటిల్స్‌తో చరిత్ర సృష్టించింది. 2010, 2012, 2014 టోర్నీల్లో ఆస్ట్రేలియా జట్టు వరుసగా మూడు టైటిల్స్ సాధించి అరుదైన ఘనత సాధించింది. ఇక, 2016లో భారత్ వేదికగా జరిగిన టోర్నీలో వెస్టిండిస్ జట్టు సంచలన ప్రదర్శన చేసింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియానే ఓడించి తొలి సారిగా ఈ ఫార్మాట్‌లో ఛాంపియన్‌గా అవతరించింది.

స్మృతి మంధాన ఇలా

స్మృతి మంధాన ఇలా

నవంబర్ 9న ప్రారంభం కానున్న ఈ మహిళల టీ20 వరల్డ్ కప్ నవంబర్ 24తో ముగియనుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈసారి భారత మహిళల జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మ్యాచ్‌కు ముందు స్మృతి మందాన మాట్లాడుతూ "ఆసియా కప్ ముగిసిన తర్వాత జరిగిన లంక సిరిస్‌లో ప్రతి ఒక్కరూ చక్కగా రాణించారు. గత మూడు నెలల్లో బౌలర్లు చక్కటి ప్రదర్శన చేస్తున్నారు. గత వరల్డ్ కప్‌తో పోలిస్తే ఈసారి ఫీల్టింగ్‌లో పది శాతం మెరుగయ్యాం" అని తెలిపారు.

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత షెడ్యూల్

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత షెడ్యూల్

Nov 9, Friday: India vs New Zealand, Guyana 8:30 pm

Nov 11, Sunday: India vs Pakistan, Guyana 8:30 pm

Nov 15, Thursday: India vs Ireland, Guyana 8:30 pm

Nov 17, Saturday: India vs Australia, Guyana 8:30 pm

The matches will be telecast live on Star Sports Network.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

ఇండియా:

హర్మన్ ప్రీత్ కౌర్ (సి), తనీయా భాటియా (వికెట్ కీపర్), ఏక్తా బిష్ట్, దయాలన్ హేమలాథ, మన్సి జోషి, వేద కృష్ణమూర్తి, స్మ్రితి మంధాన, అనుజ పాటిల్, మిధాలి రాజ్, అరుంధతి రెడ్డి, జెమిమ రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూజా వాస్ట్రాకర్, రాధా యాదవ్, పూనమ్ యాదవ్

న్యూజిలాండ్:

అమీ సాటర్థ్వైట్ (సి), సోఫీ డేవిన్, కేట్ ఇబ్రహీం, మాడీ గ్రీన్, హోలీ హుడ్లెస్టన్, హేలే జెన్సెన్, లీ కస్పెరేక్, అమేలియా కెర్, కేటీ మార్టిన్, అన్నా పీటర్సన్, హ్యారియెట్ రోవ్, లీ తహుహు, జెస్ వాట్కిన్, సుజీ బేట్స్, బెర్నాడిన్ బెజుయిడెన్హౌట్(వికెట్ కీపర్).

Story first published: Thursday, November 8, 2018, 17:29 [IST]
Other articles published on Nov 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X