న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్‌: బంగ్లాను చిత్తు చేసిన మిథాలీ సేన

బెంగళూరు: టీ20 ప్రపంచ కప్‌ టోర్నీలో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మిథాలీరాజ్ సేన 72 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగుల స్కోరు చేసింది. భారీ లక్ష్యఛేదనలో తడబడిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో అనుజ పాటిల్‌, పూనమ్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

కాగా, అంతకుముందు టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్‌.. భారత్‌ను బ్యాటింగ్‌ ఆహ్వానించింది. క్రీజులోకి దిగిన ఓపెనర్లు మిథాలీరాజ్‌ 42(35 బంతుల్లో 5ఫోర్లు), వనిత 38(24 బంతుల్లో 7ఫోర్లు) దూకుడుగా ఆడారు.

Women’s World T20, India vs Bangladesh as it happened: Mithali and Co cruise to a 72run win

వీరిద్దరు తొలి వికెట్‌కు 7.4 ఓవర్లలోనే 62 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం ఇచ్చారు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌వుమెన్‌ స్మృతి మందన డకౌటై నిరాశపరిచినా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుతంగా రాణించింది.

కౌర్ 40(29 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్స్‌లు), వేద కృష్ణమూర్తి 36 నాటౌట్‌ (24 బంతుల్లో 2సిక్స్‌లు) నిలకడగా ఆడటంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగలిగింది. 19వ ఓవర్‌ వేసిన బంగ్లా బౌలర్‌ ఫాహిమ బౌలింగ్‌లో వేద కృష్ణమూర్తి రెండు సిక్సర్లు బాదడంతో భారత్‌ టీ20ల్లో అత్యధిక స్కోర్‌ నమోదు చేయగలిగింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X