న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ టీ20: 'మిథాలీని బెంచ్‌కి పరిమితం చేయడం బాధించింది'

Womens World T20: As a fan, felt bad to see Mithali Raj sitting out: Jhulan Goswami on Harmanpreet Kaurs decision

హైదరాబాద్: వెస్టిండిస్ వేదికగా జరుగుతోన్న మహిళల వరల్డ్ టీ20లో భాగంగా ఇంగ్లాండ్‌తో శుక్రవారం ముగిసిన సెమీఫైనల్ మ్యాచ్‌లో వెటరన్ బ్యాట్స్‌మన్ మిథాలీ రాజ్‌ను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేయడంపై విమర్శల పర్వం కొనసాగుతోంది. మిథాలీని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కావడం తననెంతగానో బాధించిందని క్రికెటర్‌ జులన్‌ గోస్వామి అన్నారు.

<strong>మహిళల వరల్డ్ టీ20: సెమీపైనల్లో చతికిలబడ్డ భారత్, ఇంగ్లాండ్ చేతిలో ఓటమి</strong>మహిళల వరల్డ్ టీ20: సెమీపైనల్లో చతికిలబడ్డ భారత్, ఇంగ్లాండ్ చేతిలో ఓటమి

మిథాలీని తప్పించడంపై జులన్ గోస్వామి మాట్లాడుతూ "భారత మహిళల జట్టుకి మరోసారి నిరాశ ఎదురైంది. టోర్నీ ఆరంభం నుంచి భారత్‌ జట్టుగా మంచి ప్రదర్శన చేస్తూ ముందుకు సాగింది. టీ20 ప్రపంచకప్‌ గ్రూప్ దశలో చాలా బాగా ఆడారు. కానీ సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిపోవడం ఎంతగానో నిరాశపరిచింది" అని ఆమె అన్నారు.

మిథాలీ లేకుండా భారత్‌ బరిలోకి

మిథాలీ లేకుండా భారత్‌ బరిలోకి

"మరోవైపు తుదిజట్టులో మిథాలీ రాజ్‌ లేకుండా భారత్‌ బరిలోకి దిగటాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఆమె రిజర్వుబెంచ్‌కు పరిమితం కావడం నన్నెంతగానో బాధించింది. కీలక మ్యాచ్‌లో మిథాలీని పక్కన పెట్టడం అనేది పూర్తిగా జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయం. అప్పటి పరిస్థితుల ప్రకారం చూస్తే ఈ నిర్ణయంపై చాలా కారణాలుండొచ్చు. ఒక భారత క్రికెట్ అభిమానిగా, కీలకమైన మ్యాచ్‌లో మిథాలీని బెంచ్‌పైనే కూర్చోవడం నన్ను బాధించింది" అని జులన్‌ పేర్కొన్నారు.

ఒత్తిడిని అధిగమించి పరిస్థితులకు అనుగుణంగా

ఒత్తిడిని అధిగమించి పరిస్థితులకు అనుగుణంగా

ఇకనైనా ఒత్తిడిని అధిగమించి పరిస్థితులకు అనుగుణంగా ప్రదర్శన చేయడం అలవర్చుకోవాలని భారత మహిళా క్రికెటర్లుకు జులన్‌ ఈ సందర్భంగా సూచించింది. మహిళల వరల్డ్ టీ20లో టీ20లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీపైనల్లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.

మిథాలీని తప్పించడంపై పెద్ద ఎత్తున విమర్శలు

మిథాలీని తప్పించడంపై పెద్ద ఎత్తున విమర్శలు

అయితే, టాస్ గెలిచిన అనంతరం కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన జట్టుతోనే సెమీస్‌ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతున్నట్లు తెలిపింది. మిథాలీ రాజ్‌ను తుది జట్టు నుంచి తప్పించడమే భారత్ జట్టు ఓటమికి కారణమంటూ మాజీ క్రికెటర్లు, అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.

రెండు హాఫ్ సెంచరీలతో జట్టు విజయాల్లో కీలకపాత్ర

రెండు హాఫ్ సెంచరీలతో జట్టు విజయాల్లో కీలకపాత్ర

వరల్డ్ టీ20లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మిథాలీని తుది జట్టు నుంచి తప్పించడాన్ని వ్యాఖ్యతలు సంజయ్‌ మంజ్రేకర్‌, నాసిర్‌ హుస్సేన్‌ సైతం తప్పుబట్టారు. సెమీస్‌కి ముందు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లోనే 51 పరుగులు చేసిన మిథాలీ, ఐర్లాండ్‌పై 56 బంతుల్లో 51 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ అలవోక విజయాన్ని సాధించింది.

మిథాలీని తప్పించడంపై కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్ ఇలా

మిథాలీని తప్పించడంపై కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్ ఇలా

ఇక, మిథాలీని తుది జట్టు నుంచి తప్పించడాన్ని కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్ సమర్ధించుకుంది. మ్యాచ్ అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ "కొన్ని సార్లు మా వ్యూహం ఫలిస్తోంది. మరికొన్ని సార్లు విఫలమవుతోంది. దీనికి చింతించాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీలో మహిళల జట్లు ఆట పట్ల గర్వపడుతున్నాను. యువ జట్టుగా ఇది మాకో గుణపాఠం. కొన్ని సార్లు పిచ్‌ వికెట్‌ను బట్టి ఆటను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్లు అద్భుతంగా రాణించారు. మేం విధించిన టార్గెట్‌ను చేధించడం కూడా అంత సులువు కాదు. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. మేం మ్యాచ్‌ను 18 ఓవర్లు వరకు తీసుకొచ్చాం. యువజట్టుగా మేం మానసికంగా ధృడపడాల్సిన అవసరం ఉంది. ఒత్తిడిలో ఎలా ఆడాలో అనే దానిపై దృష్టిపెట్టుంటే.. ఇలాంటి మ్యాచ్‌లను సులువుగా మావైపు తిప్పుకునే వాళ్లం" అని తెలిపారు.

Story first published: Saturday, November 24, 2018, 13:36 [IST]
Other articles published on Nov 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X