న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup: మళ్లీ తిప్పేసిన పూనమ్ యాదవ్.. బంగ్లాపై భారత్ ఘన విజయం!!

 Womens T20 World Cup: Poonam, Shafali brilliance help India beat Bangladesh

పెర్త్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పయి 124 పరుగులే చేసింది. దీంతో భారత మహిళలు 18 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించారు. ఆస్ట్రేలియాపై 4 వికెట్లతో చెలరేగిన పూనమ్ యాదవ్.. బంగ్లాపై 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించింది. పేసర్ శిఖ పాండే, అరుంధతీ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు.

<strong>పదేళ్ల క్రితం ఇదే రోజు.. వన్డేల్లో ద్విశతకం బాదిన తొలి క్రికెటర్‌గా సచిన్!!</strong>పదేళ్ల క్రితం ఇదే రోజు.. వన్డేల్లో ద్విశతకం బాదిన తొలి క్రికెటర్‌గా సచిన్!!

రాణించిన ఖాతూన్

రాణించిన ఖాతూన్

భారత మహిళలు నిర్దేశించిన 143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మహిళల ఇన్నింగ్స్‌ నిదానంగా సాగింది. 5 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ షామిమా సుల్తానా (3; 8 బంతుల్లో)ను శిఖ పాండే ఔట్‌ చేసింది. ఫస్ట్ డౌన్‌లో క్రీజులోకి వచ్చిన సంజిద ఇస్లాం (10)తో కలిసి మరో ఓపెనర్ ముర్షిదా ఖాతూన్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ నిర్మించింది. 26 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసింది.

పూనమ్‌ మరోసారి తిప్పేసింది

పూనమ్‌ మరోసారి తిప్పేసింది

8వ ఓవర్లో తెలుగమ్మాయి అరుంధతీ రెడ్డి కీలక ఖాటూన్‌ (30; 26 బంతుల్లో 4×4)ను పెవిలియన్‌కు పంపించింది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ బంతిని కీలక స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ చేతికి ఇచ్చింది. దీంతో బంగ్లా ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. 11వ ఓవర్లో సంజిదా షాట్‌కు యత్నించి వికెట్‌కీపర్‌ తానియా చేతికి చిక్కింది. అయితే తొలుత అంపైర్‌ ఔట్ ఇవ్వలేదు. భారత్‌ సమీక్షకు వెళ్లి వికెట్‌ దక్కించుకుంది.

 భారత బౌలర్ల ఒత్తిడి

భారత బౌలర్ల ఒత్తిడి

అనంతరం అద్భుతమైన బంతితో ఫర్గానాను అరుంధతీ పెవిలియన్‌కు చేర్చింది. దీంతో బంగ్లా కీలక నాలుగు వికెట్లు కోల్పుయి కష్టాల్లో పడింది. 16వ ఓవర్లో పూనమ్‌ బౌలింగ్‌లో ఫాహిమా (17) షాట్‌కు యత్నించి షెఫాలీ చేతికి చిక్కింది. ఆపై రాజేశ్వరి కీలక వికెట్‌ పడగొట్టింది. తన బౌలింగ్‌లో నిగర్‌ (35) ను ఔట్ చేసింది. అప్పటి వరకు బలంగా కనిపించిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఆ తర్వాత క్రమంగా సడలిపోయింది. భారత బౌలర్లు ఒత్తిడి పెంచడంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

భారత్‌కు రెండో విజయం

భారత్‌కు రెండో విజయం

ఇక బంగ్లా 6 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి వచ్చింది. పాండే మూడు పరుగులే ఇవ్వడంతో పాటు రుమాన అహ్మద్ (13)ను పెవిలియన్ చేర్చింది. దీంతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. అరుంధతి (2/35), పూనమ్‌ (3/18) రాణించారు. ఇక ప్రపంచకప్‌లో భారత్‌కు రెండో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి.

షెఫాలీ మెరుపులు

షెఫాలీ మెరుపులు

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్‌ (34, 37 బంతుల్లో; 2×4, 1×6) ఆకట్టుకుంది. బంగ్లా బౌలర్లలో సల్మా ఖాతున్‌, పన్నా ఘోశ్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

Story first published: Monday, February 24, 2020, 20:24 [IST]
Other articles published on Feb 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X