న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ ఫైనల్ ఆశలు సజీవం, శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో విజయం

Women’s Asia Cup 2018: India beat Sri Lanka by 7 wickets, keeps final hopes alive

హైదరాబాద్: ఆసియాకప్‌ టీ20 టోర్నీలో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పోరాడి ఓడిన భారత్ గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విజయకేతనం ఎగరేసింది. ఏడు వికెట్ల ఆధిక్యంతో శ్రీలంక జట్టును ఓడించి ఫైనల్ చేరేందుకు ఆశలు సజీవంగా ఉంచుకుంది. శ్రీలంక నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో టోర్నీలో మూడు విజయాన్ని భారత్‌ సొంతం చేసుకుంది.

భారత విజయంలో మిథాలీ రాజ్‌(23), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(24), వేదా కృష్ణమూర్తి(29 నాటౌట్‌), అనుజా పటేల్‌( 19 నాటౌట్‌)లు తలో చేయి వేశారు. బౌలిలంగ్ విభాగంలో.. ఏక్తా బిష్త్ (2/20) రనౌట్‌ల సాయంతో.. రెండు వికెట్లను తీయగలిగింది. జూలన్ గోస్వామి (1/20), అనూజ పాటిల్ (1/19), పూనమ్ యాదవ్ (1/23)లుగా శ్రీలంక ఏడు వికెట్లు పడగొట్టి 107 పరుగులకు కట్టడి చేశారు.

లంక జట్టు ఏడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేశారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టులో యశోదా మెండిస్‌(27), హసిని పెరీరా(46 నాటౌట్‌) మినహా ఎవరూ రాణించలేదు. ఏడుగురు క్రీడాకారిణులు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో శ్రీలంక సాధారణ స్కోరుకే పరిమితమైంది.

ఆసియా కప్ టోర్నీలో భాగంగా జరిగిన నాలుగు మ్యాచ్‌లలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు సమానంగా ఆరు పాయింట్లతో కొనసాగుతున్నారు. వీటన్నిటిలో భారత్ మాత్రం నెట్ రన్‌రేట్ 2.709తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో భారత్ శనివారం జరగనున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. అదే రోజు బంగ్లాదేశ్ జట్టు మలేసియాతో తలపడనుంది. ఆఖరి సారిగా ఆడిన మ్యాచ్‌లో 36 పరుగులకే ఆల్ అవుట్ అయిన విషయం తెలిసిందే.

మొత్తంగా ఇరు జట్ల స్కోరు వివరాలు:
శ్రీలంక: 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 107/7
ఇండియా: 18.5 ఓవర్లకే 110/3

Story first published: Thursday, June 7, 2018, 16:12 [IST]
Other articles published on Jun 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X