న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నన్ను లైంగికంగా వాడుకున్నాడు.. మోసం చేశాడు: ఇప్పుడు హత్యాయత్నం: పాక్ కెప్టెన్ పై మహిళ ఫిర్యాదు

 Woman who alleged Pak skipper Babar Azam of sexual assault now alleges murder attempt

పాక్ క్రికెటర్ బాబర్ అజామ్‌ తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన కొద్దిరోజులకే తనపై ఎవరో హత్యాయత్నంకు పాల్పడ్డారంటూ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రెండు వారాల క్రితం పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికంగా వేధించాడని ఇలా గత 10ఏళ్లుగా చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

బాబర్ ఆజామ్ కష్టకాలంలో ఉన్నప్పుడు తన ఖర్చులన్నీ తానే భరించినట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పటికీ బాబర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయలేదని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి గతకొన్నేళ్లుగా తనను లైంగికంగా వాడుకున్నట్లు ఆ మహిళ ఆరోపణలు గుప్పించింది. ఒకానొక సమయంలో ఇరువురి కలయికతో తాను గర్భం దాల్చినట్లు కూడా చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత ఆమెను దూరంపెడుతూ ఇదేంటని ప్రశ్నించినప్పుడల్లా దాడి చేసేవాడని ఆ మహిళ పేర్కొంది. క్రికెట్‌ రంగంలోకి రాకముందే బాబర్ తనకు తెలుసునని ఆ మహిళ చెప్పుకొచ్చింది. తన పేదరికం నుంచి వచ్చాడని చెప్పిన మహిళ తనకు అంతా మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నట్లు చెప్పింది. తనలా మరొకరు బలికాకూడదని చెబుతూ తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని వెల్లడించింది.

2017లో నసీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాబర్‌పై ఫిర్యాదు చేసినట్లు చెప్పిన మహిళ, తనను లైంగికంగా మరియు భౌతికంగా దాడి చేశాడని తెలిపింది. ఇదిలా ఉంటే తాజాగా తనను ఎవరో హత్య చేసేందుకు చూశారని పేర్కొంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. లాహోర్‌లోని ఖానా పోలీస్ స్టేషన్‌కు సమీపంలో తన కారుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొంది. గుర్తుతెలియని వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి కాల్పులు జరిపి పారిపోయారని వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఆమెను చంపుతామనే బెదిరింపులు వస్తున్నట్లు వెల్లడించింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Story first published: Thursday, December 10, 2020, 19:31 [IST]
Other articles published on Dec 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X