న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌: మిశ్రా రెండో ఆటగాడు, ఫస్ట్ ప్లేయర్ ఎవరో తెలుసా?

With Amit Mishra being second, who was the first player to given out for obstructing the field in IPL?

హైదరాబాద్: విశాఖ వేదికగా బుధవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమిత్ మిశ్రా ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అమిత్ మిశ్రా 'అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌' ద్వారా ఔటైన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ సంఘటన ఢిల్లీ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో చోటు చేసుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఐపీఎల్ చరిత్రలో 'అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌'

ఐపీఎల్ చరిత్రలో 'అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌'

కాగా, ఐపీఎల్ చరిత్రలో 'అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌' కింద ఔటైన ఫస్ట్ ప్లేయర్‌గా యూసఫ్ పఠాన్ నిలిచాడు. 2013 ఐపీఎల్ సీజన్‌లో యూసఫ్ పఠాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడిన సమయంలో రాంచీ వేదికగా పూణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ కూడా సరిగ్గా ఇలానే పెవిలియన్‌కు చేరాడు.

162 పరుగులు చేసిన సన్‌రైజర్స్

162 పరుగులు చేసిన సన్‌రైజర్స్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమయ్యాయి. ఖలీల్ అహ్మద్ వేసిన నాలుగో బంతికి షాట్‌ ఆడబోయి మిశ్రా విఫలమయ్యాడు.

స్టంప్స్‌కు అడ్డంగా పరుగెత్తిన అమిత్ మిశ్రా

స్టంప్స్‌కు అడ్డంగా పరుగెత్తిన అమిత్ మిశ్రా

అయినా అతడు పరుగందుకున్నాడు. సన్‌రైజర్స్ వికెట్‌ కీపర్‌ సాహా బంతిని స్టంప్స్‌కు కొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత వెంటనే పిచ్‌ మధ్యలో ఉన్న ఖలీల్‌ అహ్మద్ ఆ బంతిని అందుకుని నాన్‌-స్ట్రైకింగ్‌ వైపున్న స్టంప్స్‌ కొట్టబోయాడు. అయితే, మిశ్రా ఈ సంగతి గమనించి స్టంప్స్‌కు అడ్డంగా పరుగెత్తే ప్రయత్నం చేశాడు.

ఔట్‌గా ప్రకటించిన థర్డ్ అంఫైర్

ఔట్‌గా ప్రకటించిన థర్డ్ అంఫైర్

దీంతో ఖలీల్‌ విసిరిన బంతి అతడికే తాకింది. దీనిపై ఖలీల్‌ థర్డ్ అంఫైర్ నిర్ణయాన్ని కోరాడు. ఖలీల్‌ త్రోకు ఉద్దేశపూర్వకంగా అడ్డుగా వెళ్లినందుకు ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌' కింద అంఫైర్ అతడిని ఔట్‌గా ప్రకటించాడు. చివరి రెండు బంతుల్లో ఢిల్లీ రెండు పరుగులు చేయాల్సిన రావడంతో అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఐదో బంతిని కీమో పాల్ బౌండరీ బాదడంలో ఢిల్లీ విజయం సాధించింది.

Story first published: Thursday, May 9, 2019, 10:43 [IST]
Other articles published on May 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X