న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నీ నెంబర్ డిలీట్ చేస్తా?: బంగ్లా క్రికెటర్‌కు వార్నింగ్ ఇచ్చిన బీసీబీ ఛీఫ్

'Will Delete Your Number' : BCB President Slams Cricketer Mehidy Hasan || Oneindia Telugu
Will Delete Your Number: Bangladesh Cricket Chiefs Outburst At Mehidy Hasan In Team Meeting

హైదరాబాద్: బంగ్లాదేశ్ ఆటగాళ్ల సమ్మెలో పాలు పంచుకున్నందుకు ఆల్‌ రౌండర్‌ మెహిది హసన్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛీఫ్ నజ్ముల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. భారత్‌ పర్యటనకు సంబంధించి బంగ్లాదేశ్‌ క్రికెటర్లతో జరిగిన సమావేశంలో బీసీబీ చీఫ్‌ నజ్ముల్‌ హసన్‌ అంతకముందు తాను చేసిన ఫోన్‌ కాల్‌ను మెహిదీ హాసన్ లిఫ్ట్‌ చేయకపోవడంతో అందరి ముందు తిట్టిపోశాడు.

"మిరాజ్(మెహిదీ) నీకు ఏమి చేయలేదని... నా ఫోన్‌ కాల్ నువ్వు లిఫ్ట్‌ చేయలేదు? ఈ రోజు నుంచి నీ నంబర్‌ నా దగ్గర ఉండదు. నా కాంటాక్ట్స్‌ లిస్ట్‌ నుంచి నీ నెంబర్‌ డిలీట్‌ చేస్తా" అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ సమావేశంలోనే మిగతా క్రికెటర్లపై కూడా నజ్ముల్‌ తీవ్రంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

<strong>బికినీతో మతి పొగొట్టింది: ఇంగ్లాండ్-కివీస్ మ్యాచ్‌లో అందరి చూపు ఆమెవైపే!</strong>బికినీతో మతి పొగొట్టింది: ఇంగ్లాండ్-కివీస్ మ్యాచ్‌లో అందరి చూపు ఆమెవైపే!

సమ్మెకు నాయకత్వం షకీబ్

సమ్మెకు నాయకత్వం షకీబ్

బంగ్లా క్రికెటర్లు సమ్మెకు నాయకత్వం వహించిన టెస్టు, టీ20 జట్టు కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్ మాత్రం ఈ సమావేశం అనంతరం "చర్చలు విజయవంతమయ్యాయి" అని తెలిపాడు. ఈ సందర్భంగా షకీబ్ ఉల్ హాసన్ మాట్లాడుతూ "బోర్డు అధ్యక్షుడు, డైరెక్టర్లతో సమావేశమయ్యాం. మా డిమాండ్ల గురించి వివరించాం. వారు సానుకూలంగా స్పందించారు" అని షకిబ్‌ తెలిపాడు.

డిమాండ్లను నెరవేరుస్తామని హామీ

డిమాండ్లను నెరవేరుస్తామని హామీ

"త్వరలోనే మా డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. శనివారం నుంచి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఆడుతారు. బంగ్లా జట్టు భారత్‌ పర్యటనకు వెళ్లనుంది. శుక్రవారం నుండి శిక్షణా శిబిరానికి వెళతాం" అని షకీబ్ అన్నాడు. సోమవారం తమ 11 డిమాండ్లను నెరవేర్చాలంటూ బంగ్లా క్రికెటర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.

11 ప్రధాన డిమాండ్లతో

11 ప్రధాన డిమాండ్లతో

దీంతో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నుంచి క్రికెటర్లకు గురువారం స్పష్టమైన హామీ లభించడంతో సమ్మెను విరమించారు. 11 ప్రధాన డిమాండ్లతో సమ్మెకు దిగగా అందులో తొమ్మిది డిమాండ్లను తీర్చడానికి బీసీబీ ముందుకొచ్చింది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఫీజు 35 వేల నుంచి లక్ష టకాలకు పెంచడం, ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్ల జీతాలను 50 శాతానికి పెంచడం ముఖ్యమైనవి.

నవంబర్ 3 నుంచి భారత పర్యటన

నవంబర్ 3 నుంచి భారత పర్యటన

క్రికెటర్ల డిమాండ్లకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించడంతో షకీబ్ ఉల్ హాసన్ నేతృత్వంలోని క్రికెటర్లు సమ్మె విరమించారు. దీంతో భారత్‌ పర్యటనకు మార్గం సుగమం అయింది. భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 3న జరిగే తొలి టీ20తో భారత్‌లో బంగ్లాపర్యటన షురూ కానుంది.

Story first published: Friday, October 25, 2019, 18:21 [IST]
Other articles published on Oct 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X