న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రెండోసారి వరల్డ్‌కప్ ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు'

‘Who wouldn’t want to lift World Cup twice,’ Suresh Raina gears up for IPL 12 with eyes on WC berth

హైదరాబాద్: ఐపీఎల్ 2019 షెడ్యూల్‌ని మంగళవారం బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ అనగానే మనకు ఎవరు గుర్తుకు వచ్చిన రాకపోయినా ఒక ఆటగాడు మాత్రం గుర్తుకు వస్తాడు. అతనే సీనియర్ వెటరన్ ప్లేయర్ సురేష్ రైనా. ఐపీఎల్ లో రైనా ఎన్నో విధ్వంస కరమైన ఇన్నింగ్స్ అడిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ పరుగులు (4985) చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. దీంతో పాటు 2011 వరల్డ్‌కప్‌లో ముఖ్యమైన నాకౌట్ మ్యాచ్ అయిన ఆస్ట్రేలియా మీద చేసిన ఇన్నింగ్స్ మరుపురానివి. ఆ మ్యాచ్ తర్వాత ఇండియా సెమీఫైనల్‌ల్లోకి వెళ్ళింది.

<strong>'ధోని అనుభవమే కోహ్లీ అతడిని ఆడించేలా చేస్తుంది'</strong>'ధోని అనుభవమే కోహ్లీ అతడిని ఆడించేలా చేస్తుంది'

ఐపీఎల్, వరల్డ్ కప్ 2019 గురించి రైనా ఇలా

ఐపీఎల్, వరల్డ్ కప్ 2019 గురించి రైనా ఇలా

ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్, వరల్డ్ కప్ 2019 గురించి రైనా ఎన్నో విషయాలను పంచుకున్నారు. రైనా ఏమన్నాడంటే అతని మాటల్లోనే "ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఎంతో అత్రుతుగా ఎదురు చూస్తున్నాను. రెండవ సారి ప్రపంచ కప్ ను పట్టుకోవాలని ఎవరు మాత్రం కోరుకోరు" అని తెలిపాడు.

ఫిట్‌నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టా

ఫిట్‌నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టా

"అందుకే నా ఫిట్‌నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాను. నెట్ సెషన్‌లో ఎక్కవ గా గడుపుతున్నాను. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో చాలా మంది టాలెంట్, సామర్ధ్యం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. ధోని తన వ్యూహాలతో, టీమ్‌ను ముందుండి నడుపుతున్నారు" అని అన్నాడు.

తక్కువ ఆటగాళ్లు జాతీయ టీమ్‌లోకి

తక్కువ ఆటగాళ్లు జాతీయ టీమ్‌లోకి

యూపీ నుంచి తక్కువ ఆటగాళ్లు జాతీయ టీమ్‌లోకి వస్తున్నారన్న ప్రశ్నకు గాను "యూపీ ఆటగాళ్లకు చాలా టాలెంట్ ఉంది. చాలా మంది యంగ్ ప్లేయర్స్ కష్టపడుతూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేస్తున్నారు. అయితే టీమ్‌లో ఆడటం అనేది కేవలం అవకాశాల మీద ఆధారపడి ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, February 20, 2019, 17:43 [IST]
Other articles published on Feb 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X