న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ: టీ20ల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు.. సూర్యకుమార్ ఎన్నో ర్యాంకులో ఉన్నాడో తెలుసా?

who won most player of the series awards for India in t20Is

న్యూజిల్యాండ్‌తో టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది. ఇది టీ20ల్లో అతనికి మూడో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కావడం గమనార్హం. ఈ అవార్డుతో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి దూసుకొచ్చాడు సూర్యకుమార్. అతనితోపాటు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కూడా మూడు టీ20 సిరీసుల్లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు.

ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో కింగ్ కోహ్లీ ఉన్నాడు. ఈ సూపర్ స్టార్ బ్యాటర్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఏడు సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు అందుకున్నాడు. భారత్ తరఫున ఇన్ని సార్లు ఈ అవార్డును ఎవరూ అందుకోలేదు. తన మూడో అవార్డు అందుకున్న సూర్యకుమార్.. రెండో స్థానానికి వచ్చాడు. అంటే కోహ్లీ ఈ ఫార్మాట్‌లో ఎంతగా రాణించాడో అర్థం చేసుకోవచ్చు. ఇది చూసిన అభిమానులు కింగ్ కోహ్లీకి ఎందులోనూ పోటీ లేదంటూ కామెంట్లు చేస్తున్నాు.

వీళ్లిద్దరి తర్వాత బంతితో మాయ చేసే భువనేశ్వర్ కుమార్ కూడా మూడు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులతో ఉన్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో కూడా ఈ అవార్డు భువీకే దక్కిన సంగతి తెలిసిందే. భువీ తర్వాతి స్థానంలో టీమిండియా నయా సారధి రోహిత్ శర్మ ఉన్నాడు. అతను తన సుదీర్ఘ కెరీర్‌లో రెండు టీ20 సిరీసుల్లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. ఇక చివరి స్థానంలో ఈ ఫార్మాట్‌లో టీమిండియా టాప్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. అతను కూడా రోహిత్‌లాగే రెండు సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు.

Story first published: Thursday, November 24, 2022, 18:29 [IST]
Other articles published on Nov 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X