న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'శ్రేయాస్‌ అయ్యర్‌ లవ్‌లో పడ్డాడనుకున్నా.. సైకాలజిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లా'

When a 16-year-old Shreyas Iyer was taken to a sports psychologist by his father
Shreyas Iyer Was Taken To A Sports Psychologist During His Teenage. Here's Why?

న్యూఢిల్లీ: టీనేజ్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడుతున్న సమయంలో అతని తండ్రి సంతోష్‌ అయ్యర్‌ తెగ ఆందోళన చెందారట. ప్రేమలో పడడం, చెడు సహవాసాలు తమ కుమారుడి దృష్టిని మరల్చాయేమోనని అనుకున్నారట. శ్రేయస్‌ను ఓ మేటి ఆటగాడిగా చూడాలనుకున్న తండ్రి వెంటనే కుమారుడిని గాడినపెట్టే క్రమంలో స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ దగ్గరికి కూడా తీసుకెళ్లాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సంతోష్‌ అయ్యర్‌ వెల్లడించారు.

షెడ్యూల్ ప్రకారమే టీ20 ప్రపంచకప్‌.. స్పష్టం చేసిన ఐసీసీ!!షెడ్యూల్ ప్రకారమే టీ20 ప్రపంచకప్‌.. స్పష్టం చేసిన ఐసీసీ!!

బ్యాటింగ్‌ గతి తప్పింది:

బ్యాటింగ్‌ గతి తప్పింది:

తాజాగా శ్రేయస్‌ తండ్రి సంతోష్‌ అయ్యర్‌ క్రిక్‌బజ్ షో 'స్పైసీ పిచ్'లో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. 'శ్రేయస్‌ అయ్యర్‌ 4 ఏళ్ల వయసులోనే బంతిని చక్కగా బాదేవాడు. అది చూసిన నాకు అతడి బ్యాటింగ్‌ ప్రతిభ అర్థమైంది. అందుకే శ్రేయస్‌ను మంచి బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. శిక్షణ ఇప్పించా. అయితే అండర్‌-16 క్రికెట్‌ ఆడే రోజుల్లో శ్రేయస్‌ బ్యాటింగ్‌ గతి తప్పింది. దీన్ని ఓ కోచ్‌ గమనించి నాకు చెప్పాడు' అని సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు.

లవ్‌లో పడ్డాడనుకున్నా:

లవ్‌లో పడ్డాడనుకున్నా:

శ్రేయాస్‌ కోచ్ ఓ రోజు నాతో ఏకాంతంగా మాట్లాడాడు. మీ అబ్బాయికి ప్రతిభ ఉంది. కానీ.. ఏకాగ్రతే లేకుండా పోతోంది. ఆటపై ఏమాత్రం దృష్టి సారించలేకపోతున్నాడన్నాడు. ఏం చేయాలో అర్ధం కాలేదు. ప్రేమలో పడడంతో పాటు చెడు సహవాసాలు తమ కుమారుడి దృష్టిని మరల్చాయేమోనని అనుమానించా. ఇక ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లా. ఆందోళన అనవసరమని, అందరికీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన మాకు భరోసా ఇచ్చాడు. తర్వాత ఫామ్‌ను అందుకోవడంతో శ్రేయస్‌ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు' అని సంతోష్‌ అయ్యర్‌ చెప్పుకొచ్చారు.

నాలుగో స్థానంలో శ్రేయస్‌ సరైనోడు:

నాలుగో స్థానంలో శ్రేయస్‌ సరైనోడు:

గత మూడేళ్లుగా టీమిండియాను ప్రధానంగా వేధిస్తున్న సమస్య మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌. మ్యాచ్‌ విన్నర్లుగా భావించే కీలక స్థానాల్లో సరైన బ్యాట్స్‌మన్‌ లేక తీవ్ర ఇబ్బంది పడుతోంది భారత జట్టు. కొన్ని సందర్భాల్లో టాప్‌ఆర్డర్‌ విఫలమైతే ఇక జట్టును ఆదుకునే ఆటగాడే కరువయ్యాడు. అంబటి రాయుడు, అజింక్య రహానె, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తిక్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌.. ఇలా ఎంత మందికి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ స్థానంలో మెరుస్తున్నాడు శ్రేయస్‌ అయ్యర్‌. 18 వన్డేల్లో 748 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 8 అర్ధసెంచరీలున్నాయి.

ఐపీఎల్లోనూ తనదైన ముద్ర:

ఐపీఎల్లోనూ తనదైన ముద్ర:

శ్రేయస్‌ టీమిండియా తరఫునే కాకుండా ఐపీఎల్లోనూ తనదైన ముద్ర వేశాడు. 2015లో ఢిల్లీ జట్టు తొలిసారి అతడిని 2.6 కోట్లకు దక్కించుకుంది. అందుకు తగ్గట్టే శ్రేయస్‌ ఆ సీజన్‌లో 439 పరుగులతో మంచి ప్రదర్శన చేశాడు. తర్వాత 2018లో గౌతమ్ గంభీర్‌ తప్పుకున్నాక ఢిల్లీ జట్టు సారథిగా బాధ్యతలు అందుకున్నాడు. ఆ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లోనే 411 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక 2019లో బ్యాటింగ్‌లో రాణించడమే కాకుండా కెప్టెన్‌గానూ ప్రశంసలు అందుకున్నాడు. ఏడేళ్ల తర్వాత ఢిల్లీని ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లి జట్టులో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. ఇలా బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ అదరగొడుతున్నాడు.

Story first published: Tuesday, April 7, 2020, 9:56 [IST]
Other articles published on Apr 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X