న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంక ప్లేయర్లపై ట్యాంపరింగ్ వివాదం, మొండికేసి మ్యాచ్‌కి ఆడమంటూ..!!

West Indies vs Sri Lanka: Controversy Over Ball Change Leads to Long Delay Before Play Resumes on Day 3

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఆటగాళ్ల బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం యావత్‌ క్రికెట్‌ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్‌-శ్రీలంక మధ్య రెండో టెస్టు సందర్భంగా 'టాంపరింగ్‌' మళ్లీ చర్చనీయాంశమైంది. శ్రీలంకపై బాల్‌టాంపరింగ్‌ ఆరోపణలు రావడంతో ఆ జట్టు ఆగ్రహంతో మూడో రోజు మైదానంలోకి దిగడానికి నిరాకరించింది. దీంతో ఆట రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.

బంతి ఆకారం మారిందని సందేహించిన ఫీల్డ్ అంపైర్లు:

రెండో రోజు ఆట ముగిసే దశలో బంతి ఆకారం మారిందని సందేహించిన ఫీల్డ్ అంపైర్లు అలీమ్‌ దార్, ఇయాన్‌ గౌల్డ్‌ మూడో రోజు బంతిని మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆటకు ముందే లంక కెప్టెన్‌ చండిమాల్‌కు చెప్పారు. దీంతో లంక జట్టు మైదానంలోకి దిగేందుకు ససేమిరా అనడంతో వివాదమైంది. దీంతో లంక ఆటగాళ్లు మైదానంలోకి రావడానికి నిరాకరించారు.

 మ్యాచ్‌ రిఫరీ శ్రీనాథ్‌ రంగంలోకి దిగి:

మ్యాచ్‌ రిఫరీ శ్రీనాథ్‌ రంగంలోకి దిగి:

దీంతో మ్యాచ్‌ రిఫరీ శ్రీనాథ్‌ రంగంలోకి దిగి లంకేయులతో చర్చలు జరిపాడు. కాసేపటికి ఆ జట్టు దిగి వచ్చింది. ఐతే లంక బౌలింగ్‌ సందర్భంగా బంతి ఆకారం దెబ్బ తిన్నందుకు అంపైర్లు విండీస్‌కు ఐదు పెనాల్టీ పరుగులిచ్చారు.

మ్యాచ్ ఆడేందుకు మరోసారి నిరాకరించి:

మ్యాచ్ ఆడేందుకు మరోసారి నిరాకరించి:

దీంతో లంకేయులు మరోసారి మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారు. మళ్లీ శ్రీనాథ్ జోక్యం చేసుకొని మ్యాచ్ జరిగేలా చూశారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 253 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 300 పరుగులు సాధించింది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 34/1తో ఉంది.

 ఎలాంటి తప్పు చేయలేదని:

ఎలాంటి తప్పు చేయలేదని:

తమ ఆటగాళ్లు ఎలాంటి తప్పు చేయలేదని టీమ్ మేనేజ్‌మెంట్ తమకు వివరించిందని శ్రీలంక బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. వీడియో ఫుటేజిని పరిశీలించిన తరువాత ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరిగిందా లేదా అనేది తేల్చాల్సి ఉంది.

Story first published: Sunday, June 17, 2018, 11:54 [IST]
Other articles published on Jun 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X