న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్‌ టూర్‌.. వికెట్‌ కీపర్‌గా కేఎస్‌ భరత్‌ ఎంపికకు దగ్గరగా వచ్చాడు

West Indies tour: KS Bharat Came Very Close On Earning Test Spot Says Chief Selector MSK Prasad


ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ టూర్‌కు టీమిండియా జట్లను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో జరిగిన సెలక్షన్‌ కమిటీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలలో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. మనీశ్‌ పాండే, శ్రేయస్ అయ్యర్‌, నవదీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌ వంటి వారికి చోటు కల్పించారు. అయితే తెలుగు కుర్రాడు కేఎస్‌ భరత్‌ పేరు కూడా సెలక్షన్‌ కమిటీలో చర్చకు వచ్చిందట.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

చర్చకు కేఎస్‌ భరత్ పేరు:

చర్చకు కేఎస్‌ భరత్ పేరు:

సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ ఈ సిరీస్ నుండి స్వయంగా తప్పుకోవడంతో యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. అయితే టెస్ట్‌లకు వృద్ధిమాన్‌ సాహాను ప్రత్యామ్నయ కీపర్‌గా ఎంపిక చేశారు. కానీ.. టెస్టులకు మరో వికెట్‌ కీపర్‌గా కేఎస్‌ భరత్ పేరును కూడా పరిశీలించామని ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు.

ఎంపికకు చాలా దగ్గరగా వచ్చాడు:

ఎంపికకు చాలా దగ్గరగా వచ్చాడు:

జట్ల సెలక్షన్‌ అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్‌ మాట్లాడుతూ... 'భారత్‌-ఎ జట్టులో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా యువతను ఎంపిక చేశాం. మరో వికెట్‌ కీపర్‌గా కేఎస్‌ భరత్‌ ఎంపికకు చాలా దగ్గరగా వచ్చాడు. అయితే గాయపడిన సాహాకు మరో అవకాశం ఇవ్వాలని బావిచాం. భారత్‌-ఎ తరఫున భరత్‌ అద్భుతంగా రాణించాడు. గత మూడు సిరీస్‌ల్లో మూడు సెంచరీలు బాదాడు. ఇక వికెట్‌ కీపర్‌గా 50 మందిని ఔట్ చేశాడు. టెస్టుల్లో పంత్‌, భరత్, సాహాను పరీక్షిస్తాం' అని ఎమ్మెస్కే అన్నారు.

ట్రిపుల్ సెంచరీని కూడా:

ట్రిపుల్ సెంచరీని కూడా:

వైజాగ్‌కు చెందిన కోన శ్రీకర్‌ భరత్‌ భారత్‌-ఎ తరఫున బాగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా-ఎ, ఇంగ్లాండ్‌ లయన్స్, శ్రీలంక-ఎ జట్లపై సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోర్ 142. ఇక వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ మెరుపు స్టంపింగ్స్, క్యాచ్‌లను అందుకున్నాడు. ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీని కూడా బాదాడు. ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లో 38.75 సగటు కలిగి ఉన్నాడు. ఎనిమిది సెంచరీలు, ఇరవై అర్ధ సెంచరీలు కూడా చేశాడు.

టెస్టు జట్టు:

టెస్టు జట్టు:

విరాట్‌కోహ్లీ (కెప్టెన్‌), అజింక్యా రహానే (వైస్‌ కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, ఛటేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, జస్ప్రిత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌.

Story first published: Monday, July 22, 2019, 14:18 [IST]
Other articles published on Jul 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X