న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌ టూర్.. కోహ్లీ విశ్రాంతి ఎందుకు తీసుకోలేదంటే?

Team India West Indies Tour 2019 : Virat Kohli Decided Against Rest To Secure Captaincy || Oneindia
West Indies tour 2019: Virat Kohli skips break, to lift morale of teammates battling

వచ్చే నెలలో వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం టీమిండియా జట్లను ప్రకటించింది. ఒకే సారి టెస్టు, వన్డే, టీ20లకు ఆటగాళ్లను ఎంపిక చేశారు. మూడు ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీనే బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. ఇక ప్రపంచకప్‌ సెమీస్ నుండి టీమిండియా నిష్క్రమించిన విషయం తెలిసిందే.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

గ్రూపు రాజకీయాలు:

గ్రూపు రాజకీయాలు:

ప్రపంచకప్‌ అనంతరం భారత జట్టులో విబేధాలు చెలరేగాయని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మలు జట్టును గ్రూపులుగా విభజించి రాజకీయాలు చేస్తున్నారని పుకార్లు హల్‌చల్‌ చేసాయి. మారోవైపు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు నాలుగు ట్రోఫీలు అందించిన రోహిత్‌ శర్మకు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్‌ కూడా వ్యక్తమైంది.

వేర్వేరు కెప్టెన్ల ప్రతిపాదన:

వేర్వేరు కెప్టెన్ల ప్రతిపాదన:

తీరికలేని క్రికెట్ ఆడుతున్న కోహ్లీ మొదటగా విండీస్ పర్యటనకు దూరంగా ఉంటాడని వార్తలొచ్చాయి. ఇదే సమయంలో లిమిటెడ్‌ ఫార్మాట్‌, టెస్టు ఫార్మాట్‌లకు వేర్వేరు కెప్టెన్లు ఉండాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. లిమిటెడ్‌ ఓవర్ల ఫార్మాట్‌ బాధ్యతలను రోహిత్‌కు ఇవ్వనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. దీంతో మనసు మార్చుకున్న కోహ్లీ.. విశ్రాంతి అవసరం లేదని తేల్చేసాడు. సారధ్య భాద్యతలు పోతాయనే కోహ్లీ విశ్రాంతి తీసుకోలేదని వార్తలు వచ్చాయి.

సానుకూల ధృక్పథం తీసుకురావాలని:

సానుకూల ధృక్పథం తీసుకురావాలని:

అయితే ఈ వార్తలు అన్నీ పుకార్లే అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. 'ప్రపంచకప్‌ సెమీస్ నిష్క్రమణ అనంతరం టీమిండియా జట్టు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఉన్న జట్టును విండీస్‌ పర్యటనకు పంపించడం సరికాదు. ఆటగాళ్లలో సానుకూల ధృక్పథం తీసుకురావాలి. జట్టుకు దూరంగా ఉండటం కన్నా.. జట్టుతో ఉండడమే కెప్టెన్‌ కర్తవ్యమని కోహ్లీ భావించాడు. అంతేకానీ వేరే ఉద్దేశం లేదు' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

యువతకు పెద్దపీట:

యువతకు పెద్దపీట:

భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు విండీస్ పర్యటనలో యువతకు పెద్దపీట వేశారు. ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, రాహుల్‌ చాహర్‌, నవదీప్ సైనీ వంటి వారికి అవకాశం ఇచ్చారు. సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ స్వయంగా తప్పుకోవడంతో యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. అయితే టెస్ట్‌లకు వృద్ధిమాన్‌ సాహాను ప్రత్యామ్నయ కీపర్‌గా ఎంపిక చేశారు. ఆగస్టు 3 నుండి వెస్టిండీస్‌ సిరీస్ ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, July 24, 2019, 14:59 [IST]
Other articles published on Jul 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X