న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే జట్టులో గిల్‌, రహానె లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది: గంగూలీ

West Indies tour 2019: Sourav Ganguly surprised by absence of Shubman Gill, Ajinkya Rahane in ODI squad

ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ పర్యటనకు టీమిండియా జట్లను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించింది. ఈ పర్యటనకు సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన టీమిండియా జట్లపై మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వన్డే జట్టులో యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇవ్వకపోవడం, అజింక్య రహానెను కేవలం టెస్టులకు మాత్రమే ఎంపిక చేయడం తనను ఆశ్చర్యంకు గురిచేసింది అని గంగూలీ అన్నారు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

సంతోషపరచడానికి జట్టును ఎంపిక చేయకూడదు:

బుధవారం గంగూలీ ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. 'భారత సెలెక్టర్లు అన్ని ఫార్మాట్‌లకు ఒకే ఆటగాళ్లను ఎంపిక చేసే సమయం ఆసన్నమైంది. దీంతో ఆటగాళ్లు మరింత విశ్వాసంతో ఆడుతారు. ప్రస్తుతం చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే మూడు ఫార్మాట్‌ల్లో ఆడుతున్నారు. గొప్ప జట్లలో ఆటగాళ్లు స్థిరంగా ఉంటారు. అందరిని సంతోషపరచడానికి జట్టును ఎంపిక చేయకూడదు. దేశానికి ఉత్తమ జట్టుని సెలెక్ట్ చేయాలి' అని గంగూలీ ట్వీట్‌ చేశారు.

ఎంపిక ఆశ్చర్యంకు గురిచేసింది:

'అన్ని ఫార్మాట్లలలో ఆడగల చాలా మంది జట్టులో ఉన్నారు. వెస్టిండీస్‌-ఎతో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్‌ గిల్‌కు వన్డే జట్టులో అవకాశం ఇవ్వకపోవడం, అజింక్య రహానెను కేవలం టెస్టులకు మాత్రమే ఎంపిక చేయడం ఆశ్చర్యంకు గురిచేసింది' అని గంగూలీ మరో ట్వీట్‌ ద్వారా అన్నారు.

టెస్ట్‌లకు మాత్రమే:

టెస్ట్‌లకు మాత్రమే:

వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన మూడు ఫార్మాట్లలలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజాలు మాత్రమే చోటు దక్కించుకున్నారు. స్టార్ పేసర్ జస్ప్రిత్‌ బుమ్రాను టెస్ట్‌లకు మాత్రమే ఎంపిక చేశారు. ఇక మరో పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ టెస్ట్‌లకు ఎంపిక కాలేదు. బొటన వేలి గాయం నుండి పూర్తిగా కోలుకున్న ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఎంపిక చేశారు. అంజిక్య రహానె టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. ఆగస్టు 3 నుంచి వెస్టిండీస్‌ సిరీస్ ప్రారంభం కానుంది.

వన్డే జట్టు:

వన్డే జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌సైనీ.

Story first published: Wednesday, July 24, 2019, 12:49 [IST]
Other articles published on Jul 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X