న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Well done Bangladesh: ఇరు జట్లకు ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపిన గంగూలీ

Well done Bangladesh: BCCI president Sourav Ganguly congratulates visitors after Delhi T20I win


హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని తొలి టీ20 ఆడినందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత్, బంగ్లాదేశ్ జట్లకు కృతజ్ఞతలు తెలిపాడు. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20కి వాతావరణ కాలుష్యం భయపెట్టిన సంగతి తెలిసిందే.

ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీని పొగ కమ్మేసిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, అరుణ్‌ జైట్లీ స్టేడియాన్ని నీటితో పెద్దఎత్తున కడగడంతో పాటు వాయు శుద్ధి యంత్రాలు వాడి మ్యాచ్‌ జరిగేలా ఏర్పాట్లు చేశారు.

ట్విట్టర్‌లో నెటిజన్ల ఛలోక్తులు: ముష్ఫికర్‌ క్యాచ్‌ను పట్టిఉంటే మ్యాచ్ ఫలితం మరోలా!ట్విట్టర్‌లో నెటిజన్ల ఛలోక్తులు: ముష్ఫికర్‌ క్యాచ్‌ను పట్టిఉంటే మ్యాచ్ ఫలితం మరోలా!

అధిక స్థాయిలో కాలుష్యం ఉన్నప్పటికీ

రాజధానిలో అధిక స్థాయిలో కాలుష్యం ఉన్నప్పటికీ, రెండు క్రికెట్ జట్లు మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ తన ట్విట్టర్‌లో "కఠిన పరిస్థితులలో మ్యాచ్ ఆడిన ఇరు జట్లకు ధన్యవాదాలు .. బంగ్లాదేశ్ అద్బుత ప్రదర్శన చేసింది" అంటూ ట్వీట్ చేశాడు.

7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం

7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం

తీవ్ర వాయు కాలుష్యం నడుమ మందకొడి పిచ్‌పై ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా తొలి ఓవర్లోనే ఓపెనర్ లిటన్‌ దాస్‌ (7) వికెట్‌ కోల్పోయింది. కెరీర్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న నయీమ్‌ (28 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్‌), సౌమ్య సర్కార్‌ (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

ముష్ఫికర్‌ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడే

ముష్ఫికర్‌ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడే

పవర్‌ప్లే ముగిసేసరికి బంగ్లా 45 పరుగులు చేసింది. అయితే స్పిన్నర్ చహల్‌ తన తొలి ఓవర్లోనే నయీమ్‌ను అవుట్‌ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్‌ రహీమ్‌ (43 బంతుల్లో 60 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి సర్కార్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ముష్ఫికర్‌ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవుటయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.

కృనాల్ క్యాచ్ వదిలేయడంతో

కృనాల్ క్యాచ్ వదిలేయడంతో

ఇక దూకుడుగా ఆడుతున్న సర్కార్‌ను ఖలీల్‌ బౌల్డ్‌ చేయడంతో బంగ్లా మూడో వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో ముష్ఫికర్, మహ్ముదుల్లా (15 నాటౌట్‌) కలిసి జట్టును గెలుపు తీరాలకు చేరువ చేశారు. బంగ్లా విజయానికి 18 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో బౌండ్రీ వద్ద కృనాల్ క్యాచ్ వదిలేయడంతో ముష్ఫికర్ బతికిపోయాడు. ఆ ఓవర్‌లో బంగ్లా 13 పరుగులు పిండుకుంది.

148 పరుగులు చేసిన టీమిండియా

148 పరుగులు చేసిన టీమిండియా

ఆ తర్వాత ఖలీల్ వేసిన ఓవర్లో ముష్ఫికర్ వరుసగా 4 ఫోర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. చివరి ఓవర్లో మహ్ముదుల్లా సిక్స్ కొట్టి బంగ్లాకు విజయాన్ని అందించాడు. బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 4, 2019, 12:52 [IST]
Other articles published on Nov 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X