న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాహల్, కుల్దీప్‌ల కోసం కొత్త ప్లాన్, డివిలియర్స్ రాకతో కొత్త ఉత్సాహం

By Nageshwara Rao
 We need to re-work our plan to tackle Chahal, Yadav: Duminy

హైదరాబాద్: భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కొవాలనే దానిపై ఓ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ జేపీ డుమిని తెలిపాడు. ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా బుధవారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే జరిగింది.

3వ వన్డేలో 34వ సెంచరీతో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులివే3వ వన్డేలో 34వ సెంచరీతో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులివే

ఈ మ్యాచ్‌లో 304 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టులో జేపీ డుమిని (51: 67 బంతుల్లో 4 ఫోర్లు) ఒక్కడే భారత బౌలర్లని ఎదుర్కొని చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. అయితే, చాహల్ వేసిన బంతిని అర్ధం చేసుకోలేక వికెట్ల ముందు ఎల్బీగా పెవిలియన్‌కు చేరిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో కుల్దీప్(4/23), చాహల్ (4/46) వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో మూడో వన్డేలో 304 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 40 ఓవర్లకు 179 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ మూడో వన్డేలో 124 పరుగుల తేడాతో విజయం సాధించింది.

దీంతో ఆరు వన్డేల సిరీస్‌లో భారత్ 3-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ అనంతరం జేపీ డుమిని మాట్లాడుతూ 'సఫారీ పిచ్‌ల తీరుని దక్షిణాఫ్రికా జట్టు కంటే.. టీమిండియానే బాగా అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్‌లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు' అని అన్నాడు.

టీ20 లీగ్స్ వైపు యువత: టెస్టు ఫార్మాట్‌ను నిర్లక్ష్యం చేయడంపై సంగక్కర టీ20 లీగ్స్ వైపు యువత: టెస్టు ఫార్మాట్‌ను నిర్లక్ష్యం చేయడంపై సంగక్కర

'వారిద్దరూ మా జట్టు బౌలర్ల కంటే తక్కువ వేగంతో బంతులు విసురుతున్నారు. సింగిల్స్ తీసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. వారిద్దరి కారణంగానే మా గేమ్ ప్లాన్ ఆధారంగా ఆడలేకపోతున్నాం. అయినా, సఫారీ బ్యాట్స్‌మెన్‌ వాటిని నేలపై బౌండరీకి తరలించలేక గాల్లోకి లేపేస్తున్నారు' అని డుమిని తెలిపాడు.

'దీంతో క్రమంగా ఒత్తిడికి గురవుతూ క్రీజులో స్వేచ్ఛగా ఎక్కువ సేపు నిలవలేకపోతున్నారు. వారి బౌలింగ్‌ని అర్థం చేసుకుని క్రీజులో నిలదొక్కుకోగలిగితే పరుగులు వాటంతట అవే వస్తాయి. సిరీస్‌లో మిగిలిన మూడు వన్డేల్లోనైనా అలా ఆడేందుకు ప్రయత్నిస్తాం' అని డుమిని ఆశాభావం వ్యక్తం చేశాడు.

'ప్రతి ఒక్క క్రికెటర్ కూడా తన కెరీర్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటాడు. నాలుగో వన్డేలో ఏబీ డివిలియర్స్ జట్టులోకి రావడం మా అందరికీ కొంతమేరకు ఉత్సాహాన్నిస్తుంది. వన్డే క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో డివిలియర్స్ ఒకడు. గాయం కారణంగా భారత్‌తో తొలి మూడు వన్డేలకు దూరమయ్యాడు. అతని పునరాగమనంతో జట్టులో ఉత్సాహం రెట్టింపవుతుంది' అని అన్నాడు.

'ఒత్తిడి నుంచి కోలుకుని మిగతా మూడు వన్డేల్లో సత్తా చాటుతాం జట్టులో అతడు ఆత్మవిశ్వాసాన్ని నింపగలడు. శనివారం జొహానెస్‌బర్గ్‌లో ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. ఈ వన్డేకు డివిలియర్స్‌ అందుబాటులో ఉంటాడు. సిరీస్‌ ఇంకా భారత్‌ వశం కాలేదు. ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి' అని డుమిని చెప్పుకొచ్చాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 8, 2018, 15:11 [IST]
Other articles published on Feb 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X