న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

360 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంపై ఇంగ్లాండ్ కెప్టెన్

 We believe we can chase big totals - Morgan

హైదరాబాద్: బిగ్ టార్గెట్స్‌ను ఛేదించే సత్తా మాలో ఉందని ఇంగ్లాండ్ వన్డే జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించి సిరిస్‌ను ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. కింగ్‌స్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండిస్ నిర్దేశించిన 361 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించిన సంగతి తెలిసిందే. ఫలితంగా గత నాలుగేళ్లలో మూడుసార్లు 400పైచిలుకు స్కోరు చేసిన జట్టుగా ఇటీవల రికార్డ్ సృష్టించింది.

గిన్నిస్ రికార్డు: ఎత్తు నుంచి విసిరిన బంతిని ఒడిసి పట్టుకుంది (వీడియో)గిన్నిస్ రికార్డు: ఎత్తు నుంచి విసిరిన బంతిని ఒడిసి పట్టుకుంది (వీడియో)

ఇంగ్లాండ్ చరిత్రలో అతి పెద్ద ఛేజింగ్‌ స్కోరు

ఇంగ్లాండ్ చరిత్రలో అతి పెద్ద ఛేజింగ్‌ స్కోరు

దీంతో ఇంగ్లాండ్‌ వన్డే క్రికెట్‌ చరిత్రలో అతి పెద్ద ఛేజింగ్‌ స్కోరుగా ఇది నమోదైంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో జాసన్‌ రాయ్‌(123), జో రూట్‌(102)లు సెంచరీలు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ "మా బ్యాటింగ్‌పై మాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. పెద్ద పెద్ద లక్ష్యాలను ఛేదించే సత్తా మాలో ఉంది" అని అన్నాడు.

ఆరంభం నుంచి దూకుడుగానే ఆడాం

ఆరంభం నుంచి దూకుడుగానే ఆడాం

"తొలి వన్డేలో ఆరంభం నుంచి దూకుడుగానే ఆడాం. బ్యాటింగ్‌లో కచ్చితమైన ప్రణాళికలు అమలు చేశాం. జాసన్‌ రాయ్‌, జో రూట్‌ల ప్రదర్శన నిజంగా అద్భుతం. మేం ఎక్కడ ఒత్తిడిలో పడిన సందర్భం లేదు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు రన్‌రేట్‌ను కాపాడుకుంటూ వచ్చాం. విండీస్‌ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాం" అని మోర్గాన్‌ చెప్పుకొచ్చాడు.

క్రిస్ గేల్ సెంచరీ

క్రిస్ గేల్ సెంచరీ

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టులో ఓపెనర్ క్రిస్‌గేల్ (135) సెంచరీ సాధిండంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. గేల్‌తో పాటు ఆ జట్టులో షైహోప్ (64), డారెన్ బ్రావో (40) మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్‌లో 12 సిక్సర్లు బాదడంతో ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా క్రిస్‌గేల్ చరిత్ర సృష్టించాడు.

అఫ్రిది రికార్డుని బద్దలు కొట్టిన గేల్

అఫ్రిది రికార్డుని బద్దలు కొట్టిన గేల్

ఈ జాబితాలో ఇప్పటిదాకా 476 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్న పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది రికార్డును క్రిస్‌గేల్ బద్దలు కొట్టాడు. 361 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 48.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 364 పరుగులతో లక్ష్యాన్ని అందుకుంది. రికార్డుల పరంగా వన్డేల్లో ఇంగ్లాండ్‌కి ఇదే అతిపెద్ద ఛేదన. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం జరగనుంది.

Story first published: Thursday, February 21, 2019, 17:48 [IST]
Other articles published on Feb 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X