ఢిల్లీతో మ్యాచ్: యువరాజ్ 11 ఫోర్లు బాదాడిలా! (వీడియో)

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ మెరుపులు మెరిపించాడు. మళ్లీ మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ మెరుపులు మెరిపించాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

యువరాజ్ సింగ్ (41 బంతుల్లో 70 నాటౌట్;11 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో రాణించాడు. తొలుత కుదురుగా బ్యాటింగ్ చేసిన యువీ.. చివరి ఓవర్లలో ఫోర్లతో రెచ్చిపోయాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో టీ20ల్లో 25వ అర్ధసెంచరీని యువీ నమోదు చేశాడు.

Watch: Yuvraj's Half-Century and Warner's Switch-Hit Six vs Delhi

జట్టు స్కోరు 75 పరుగుల వద్ద శిఖర్‌ ధావన్‌ అవుటైన తర్వాత క్రీజులో వచ్చిన యువరాజ్ (41 బంతుల్లో 70; 11 ఫోర్లు, ఒక సిక్సు) రాణించాడు. తొలుత కుదురుగా బ్యాటింగ్ చేసిన యువీ.. చివరి ఓవర్లలో ఫోర్లతో రెచ్చిపోయాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు.

తనకు అందివచ్చిన లైఫ్‌ని యువరాజ్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. క్రిస్ మోరిస్‌ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. రబాడ వేసిన చివరి ఓవర్లో నాలుగు ఫోర్లు బాది సన్‌రైజర్స్‌ స్కోర్‌ను 185 పరుగులకు తీసుకెళ్లాడు. ఇలా మొత్తం యువీ 11 బౌండలరీతో పాటు ఒక సిక్సుతో విరుచకుపడ్డాడు.

Story first published: Wednesday, May 3, 2017, 18:46 [IST]
Other articles published on May 3, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి