న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిటైర్మెంట్ తర్వాత: చిన్నస్వామి స్టేడియంలో సెహ్వాగ్ భారీ సిక్స్ (వీడియో)

By Nageshwara Rao
WATCH: Virender Sehwag returns to pitch, smashes opposition bowlers out of the park to roll back the years

హైదరాబాద్: వీరేంద్ర సెహ్వాగ్... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సెహ్వాగ్.. ఆ తర్వాత అప్పుడప్పుడు పరిమిత ఓవర్ల లీగ్‌లో అభిమానులను కనువిందు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సెహ్వాగ్‌ మరోసారి బ్యాట్‌ పట్టాడు.

రివ్యూలో కోహ్లీ తడబాటు: చెత్త రివ్యూయర్ అంటూ మైకేల్ వాన్ ట్వీట్రివ్యూలో కోహ్లీ తడబాటు: చెత్త రివ్యూయర్ అంటూ మైకేల్ వాన్ ట్వీట్

అంతేకాదు భారీ సిక్స్‌ కూడా కొట్టి తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. బెంగళూరులో కర్ణాటక చలన చిత్ర కప్‌(కేసీసీ) పేరుతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌ల్లో కన్నట రంగానికి చెందిన నటులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సైతం పాల్గొన్నారు.

10 ఓవర్ల టోర్నీ అయిన ఈ మ్యాచ్‌లో కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ కెప్టెన్‌గా ఉన్న కదంబ లయన్స్‌ జట్టులో సెహ్వాగ్‌ సభ్యుడిగా ఉన్నాడు. టోర్నీలో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ భారీ సిక్స్‌ కొట్టాడు. మరోసారి బ్యాట్‌ పడితే ఎలా ఉంటుందో సెహ్వాగ్‌ రుచి చూపించాడు.

'భారత్‌పై ఆ ఒక్క విజయం పాక్ ఆటతీరుని సమూలంగా మార్చింది''భారత్‌పై ఆ ఒక్క విజయం పాక్ ఆటతీరుని సమూలంగా మార్చింది'

ఓపెనర్‌గా దిగిన సెహ్వాగ్‌ తొలి ఓవర్‌లోనే ఫోర్‌, సిక్స్‌, ఫోర్‌ కొట్టాడు. అంతేకాదు, తాను సిక్స్‌ కొట్టిన వీడియోను సెహ్వాగ్‌ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ "ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. ఈ రోజు ఎంతో సరదాగా బ్యాటింగ్‌ చేశాను" అని కామెంట్ పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సెహ్వాగ్ ట్విటర్‌ ద్వారా నిత్యం అభిమానులకు టచ్‌లోనే ఉంటోన్న సంగతి తెలిసిందే. భారత్ జట్టులో అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో సెహ్వాగ్ ఒకడు. భారత తరుపున 104 టెస్టులు, 251 వన్డేలాడిన సెహ్వాగ్ అన్ని ఫార్మాట్లలో కలిపి 16,859 పరుగులు చేశాడు.
Story first published: Monday, September 10, 2018, 15:20 [IST]
Other articles published on Sep 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X