న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి వన్డేలో విజయం: మైదానంలో కోహ్లీ, ధోని ఏం చేశారో చూడండి (వీడియో)

Virat Kohli, MS Dhoni Find A Unique Way To Celebrate India's Victory Over New Zealand | Oneindia
Watch: Virat Kohli, MS Dhoni find a unique way to celebrate Indias victory over New Zealand

హైదరాబాద్: ఆసీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించిన కోహ్లీసేన న్యూజిలాండ్‌ గడ్డపై కూడా అదే ఊపును కొనసాగించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం నేపియర్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

స్టంప్ మైక్‌లో రికార్డు: పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ జాతి వివక్ష వ్యాఖ్యలుస్టంప్ మైక్‌లో రికార్డు: పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ జాతి వివక్ష వ్యాఖ్యలు

మ్యాచ్‌ ముగిసిన తర్వాత మెక్‌లీన్‌ మైదానంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ధోని కాసేపు సందడి చేశారు. సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ టూవీలర్‌ 'సెగ్‌వే'పై చక్కర్లు కొట్టారు. తొలుత ధోని ఈ టూవీలర్‌పై చక్కర్లు కొట్టగా... ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దీనిపై హుషారుగా ప్రయాణించాడు. రకరకాల విన్యాసాలు చేస్తూ అక్కడున్నవారిని అలరించాడు.

1
44080

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. దీంతో ఇది వైరల్‌గా మారింది. సాధారణంగా మైదానం సిబ్బంది సులువుగా ప్రయాణించేందుకు ‘సెగ్‌వే'ను వినియోగిస్తారు. కాగా, ఇరు జట్ల మధ్య రెండో వన్డే జనవరి 26న జరగనుంది.

న్యూజిలాండ్ నిర్దేశించిన 156 పరుగులు లక్ష్యాన్ని

న్యూజిలాండ్ నిర్దేశించిన 156 పరుగులు లక్ష్యాన్ని

తొలి వన్డేలో న్యూజిలాండ్ నిర్దేశించిన 156 పరుగులు లక్ష్యాన్ని 34.5 ఓవర్లలోనే ఛేదించింది. భారత బ్యాట్స్‌మెన్లలో శిఖర్‌ ధావన్‌ (75 నాటౌట్‌: 103 బంతుల్లో 6 ఫోర్లు), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (45: 59 బంతుల్లో 3 ఫోర్లు), అంబటి రాయుడు (13 నాటౌట్‌)లు రాణించారు. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం నమోదైన అనంతరం రోహిత్‌ శర్మ(11) క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు.

సూర్యుడి కారణంగా మ్యాచ్ నిలిపివేత

సూర్యుడి కారణంగా మ్యాచ్ నిలిపివేత

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో శిఖర్ ధావన్‌ దూకుడుగా ఆడాడు. భోజన విరామం తర్వాత మైదానంలోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్‌ అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలను తట్టుకోలేకపోయారు. సూర్యుడి కిరణాలు సరిగ్గా బ్యాట్స్‌మన్ కళ్లలోకి పడటంతో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందులు తలెత్తాయి. సూర్యుడి కిరణాలు నేరుగా కళ్లలోకి పడటంతో బ్యాటింగ్ చేస్తున్న శిఖ‌ర్ ధావ‌న్ అంపైర్ల‌కు ఫిర్యాదు చేశాడు.

156 పరుగులకు లక్ష్యం కుదింపు

156 పరుగులకు లక్ష్యం కుదింపు

దీంతో అంఫైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించి టీమిండియాకు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. మ్యాచ్‌ పునఃప్రారంభమైన తర్వాత శిఖర్ ధావన్‌ విజృంభించాడు. ఇద్దరూ కలిసి బౌండరీలు బాదారు. కివీస్‌ బౌలర్లతో ఆటాడుకున్నారు. ఈ క్రమంలో 69 బంతుల్లో కెరీర్‌లో 26వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు కోహ్లీ(45) కూడా హాఫ్‌ సెంచరీకి చేరువగా వచ్చి కివీస్ పేసర్ ఫెర్గూసన్ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

8 వికెట్ల తేడాతో భారత్ విజయం

8 వికెట్ల తేడాతో భారత్ విజయం

దీంతో మూడో వికెట్‌కు నమోదైన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే అప్పటికి టీమిండియా విజయానికి 20 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు(13)తో కలిసి ధావన్(75) మిగతా పనిని పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 24 పరుగుల అజేయ భాగస్వామ్యంతో టీమిండియాకు విజయాన్ని అందించారు. దీంతో భారత్‌ 85 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Story first published: Thursday, January 24, 2019, 9:40 [IST]
Other articles published on Jan 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X