న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చిన్న పిల్లాడిలా ఎగిరి గంతేసిన కోహ్లీ: బీసీసీఐ చూపించని వీడియో ఇదే!

IND VS NZ 2020 : Virat Kohli Jumps Like A Kid, Runs To Hug Rohit Sharma After Super Over Victory
WATCH: Virat Kohli jumps like a kid, runs to hug Rohit Sharma after Hitmans 2 match-winning sixes

హైదరాబాద్: బుధవారం సెడాన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌లో ప్రేక్షకులను మనివేళ్లపై నిల్చోబెట్టింది. అత్యంత నాటకీయత మధ్య ముగిసిన మ్యాచ్‌ను అభిమానులు ఎంతగానో ఆస్వాదించారు.

మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: కోబీ బ్రయంట్ భావోద్వేగ పోస్టు!మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: కోబీ బ్రయంట్ భావోద్వేగ పోస్టు!

బంతి బంతికి మారిన సమీకరణాలు

బంతి బంతికి మారిన సమీకరణాలు

బంతి బంతికి సమీకరణాలు మారిన నేపథ్యంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో మ్యాచ్‌ను తిలకించారు. ఇరు జట్లు సమానంగా స్కోరు చేయడంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడించారు. సూపర్ ఓవర్‌లో కివీస్‌ 18 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, దానిని టీమిండియా ఛేదించింది.

చివరి రెండు బంతులకు 10 పరుగులు

చివరి రెండు బంతులకు 10 పరుగులు

అయితే, చివరి రెండు బంతులకు 10 పరుగులు కావాల్సిన తరుణంలో అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. యార్కర్‌గా వేసిన ఐదో బంతిని రోహిత్‌ భారీ ఎత్తులోంచి సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతిని మళ్లీ యార్కర్‌ విసరడంతో హిట్‌మ్యాన్‌ మరో భారీ సిక్సర్‌గా మలచడంతో భారత్‌ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

రెండు సిక్సులు బాదిన రోహిత్ శర్మ

రెండు సిక్సులు బాదిన రోహిత్ శర్మ

ఈ సందర్భంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా కుర్రాళ్లు మైదానంలోకి పరుగెత్తారు. ఆనందంలో విరాట్ కోహ్లీ ఎగిరి గంతులేశాడు. ఒక చిన్న పిల్లోడు మాదిరిగా తన సంతోషాన్ని పంచుకున్నాడు. చిన్న పిల్లోడి మాదిరి జంప్‌ చేసుకుంటూ వెళ్లి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన రోహిత్‌ శర్మను ఆలింగనం చేసుకున్నాడు.

రోహిత్‌ను అమాంతం వాటేసుకున్న కోహ్లీ

రోహిత్‌ను అమాంతం వాటేసుకుని అభినందనల్లో ముంచెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్టు చేసిన మహిరత్ అనే ఓ నెటిజన్ బీసీసీఐ చూపించని కంటెంట్ చూసేందుకు క్రికెట్ అభిమానులు అర్హులంటూ వీడియోని తన ఖాతాలో పోస్టు చేశాడు.

Story first published: Thursday, January 30, 2020, 13:53 [IST]
Other articles published on Jan 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X