ఆటపట్టించాడు: విమానంలో ధావన్ చిలిపి చేష్టలు(వీడియో)

Posted By:
Watch: Shikhar Dhawan Plays A Hilarious Prank On Shakib Al Hasan And Rashid Khan

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ జట్టులోని సహచర ఆటగాళ్లను ఆటపట్టించడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఈ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లను గెలిచి పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన తదుపరి మ్యాచ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ఆడేందుకు ఇప్పటికే మొహాలీ చేరుకుంది.

అయితే మొహాలీ చేరుకునేందు హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరిన సహచర ఆటగాళ్లను ధావన్ ఓ ఆటాడుకున్నాడు. విమానం ఎక్కగానే చాలా మంది ఆటగాళ్లు నిద్రలోకి జారుకున్నారు. ధావన్‌కి నిద్ర రాలేదు. దీంతో హాయిగా నిద్రపోతున్న బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ ఉల్ హసన్, ఆఫ్ఘన్ ప్లేయర్ రషీద్ ఖాన్‌లను ఆటపట్టించాడు.

 విమానంలో ధావన్‌ చిలిపి చేష్టలు

విమానంలో ధావన్‌ చిలిపి చేష్టలు

ఈ ఇద్దరూ విమానం ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో ధావన్ ఓ పేపర్ ముక్కను చుట్టి వాళ్ల ముక్కుల్లో పెట్టడంతో ఏం జరిగిందో తెలియక సడెన్‌గా వాళ్లు మేల్కొన్నారు. అయితే, తమ నిద్రకు భంగం కలిగించిన ధావన్‌ను వీరిద్దరూ ఏం అనలేదు. ధావన్‌ చిలిపి చేష్టలను చూసి విమానంలో ఉన్న వారంతా నవ్వుతూనే ఉన్నారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియోని సన్‌రైజర్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్‌ తన తదుపరి మ్యాచ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో గురువారం తలపడనుంది. మొహాలీ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ సీజన్‌లో ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

సన్‌రైజర్స్ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్

ఇదిలా ఉంటే భారత క్రికెటర్లంటే తనకు చాలా ఇష్టమని, సచిన్‌ టెండూల్కర్ తన అభిమాన ఆటగాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెప్పాడు. గత కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహారించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ బాల్‌టాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురవ్వడంతో కేన్‌ విలియమ్సన్‌కు ఆ జట్టు ఫ్రాంఛైజీ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.

సచిన్‌కు పెద్ద అభిమానిని

ఈ సందర్భంగా విలియమ్సన్ మాట్లాడుతూ 'భారత్‌కు చెందిన ఎంతో మంది క్రికెటర్లకు నేను అభిమానిని. టెస్టుల్లో భారత్‌పైనే నేను అరంగేట్రం చేశాను. ఆ టెస్టు భారత్‌లోనే జరిగింది. అప్పుడే మొదటిసారి సచిన్‌ను చూశాను. నా 19-20 ఏళ్ల వయసులో నేను మొదటి టెస్టు ఆడే సమయంలో భారత జట్టులో సచిన్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ లాంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. ఆ వయస్సులో వారితో ఆడటాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. సచిన్‌ బ్యాటింగ్‌ చేసే సమయంలో మైదానంలో ఎంతో దగ్గరి నుంచి చూసి చాలా సంతోషపడ్డా. నేను అతని అభిమానిని' అని అన్నాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 17, 2018, 14:52 [IST]
Other articles published on Apr 17, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి