న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Match 7, RCB vs MI: బౌండరీ లైన్ వద్ద అద్భుతం చేసిన నవదీప్ షైనీ (వీడియో)

WATCH – IPL 2019: Match 7, RCB vs MI: Navdeep Saini Takes A Blinder At The Boundary Line

హైదరాబాద్: ముంబై ఇండియన్స్‌తో చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డర్ నవదీప్ షైనీ బౌండరీ లైన్ వద్ద అద్భుతం చేశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ముంబై ఇండియన్స్ హిట్టర్ కృనాల్ పాండ్య‌ా (1) లాంగ్ లెగ్ దిశగా సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న నవదీప్ షైనీ అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని క్యాచ్‌గా అందుకుని.. పాదాలు లైన్‌ని తాకకుండా బ్యాలెన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుతమైన క్యాచ్‌కి ఆర్సీబీ అభిమానులు సైతం ముగ్ధులయ్యారు. కాగా, ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన నవదీప్ 40 పరుగులిచ్చాడు.

ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ

ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ

ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ (48: 33 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్), హార్దిక్ పాండ్యా (32 నాటౌట్: 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

188 పరుగుల లక్ష్య చేధనలో

188 పరుగుల లక్ష్య చేధనలో

ముంబై నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య చేధనలో బెంగళూరు బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ (70 నాటౌట్: 41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా జట్టుని గెలిపించలేకపోయాడు. నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌‌లో బెంగళూరు విజయానికి ఆఖరి 18 బంతుల్లో 40 పరుగులు అవసరమయ్యాయి.

హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుసగా 4, 6, 6 బాదిన డివిలియర్స్

హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుసగా 4, 6, 6 బాదిన డివిలియర్స్

ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుసగా 4, 6, 6 బాదిన ఏబీ డివిలియర్స్ 18 పరుగులు రాబట్టాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 22 పరుగులుగా మారింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్‌తో డివిలియర్స్‌ని కట్టడి చేస్తూ కేవలం 5 పరుగులు మాత్రమే ఇవ్వడంతో పాటు దూకుడుగా ఆడుతోన్న గ్రాండ్‌హోమ్ (2)ని ఔట్ చేశాడు.

5 బంతుల్లో 17 పరుగులుగా మారిన సమీకరణం

దీంతో సమీకరణం 5 బంతుల్లో 17 పరుగులుగా మారింది. ఇక, ఆఖరి ఓవర్ వేసిన మలింగ తొలి బంతికే సిక్స్ కొట్టించుకున్నా తర్వాత తన యార్కర్లలో వరుసగా 1, 1, 1, 1,0 తో ముంబైని గెలిపించాడు. నిజానికి ఆఖరి బంతిని మలింగ నోబాల్‌గా విసిరినా ఫీల్డ్ అంపైర్ పసిగట్టలేకపోయాడు. దీంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.

Story first published: Friday, March 29, 2019, 10:48 [IST]
Other articles published on Mar 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X