న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

త్వరలో లంక పర్యటన: బంగ్లా బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా వసీం జాఫర్‌

Wasim Jaffer to be Bangladesh’s batting consultant for Sri Lanka tour

హైదరాబాద్: ఈ ఏడాది మే నెలలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) హై పర్ఫామెన్స్‌ యూనిట్‌లో నియమించబడ్డ భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ను మంగళవారం బంగ్లాదేశ్‌ జాతీయ క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఇందుకు బాధ్యత వహిస్తూ ఆ జట్టు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌‌గా ఉన్న నీల్‌ మెకంజే తన కాంట్రాక్టుని పొడిగించుకునేందుకు అంగీకరించలేదు.

దీంతో అతడి స్థానంలో స్థానంలో వసీం జాఫర్‌ను బంగ్లా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు జాఫర్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. బౌలింగ్‌ కన్సల్టెంట్‌ చంపక రమననాయకేతో కలిసి జాఫర్‌ పని చేయనున్నాడు.

ఈ విషయమై బీసీబీ క్రికెట్‌ ఆపరేషన్స్‌ ఛైర్మన్‌ అక్రమ్‌ ఖాన్‌ మాట్లాడుతూ "కొన్ని వ్యక్తిగత వ్యవహారాల కారణంగా మెకంజీ బ్యాటింగ్‌ కోచ్‌గా అందుబాటులో ఉండటం లేదు. దీంతో జాఫర్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపిక చేశాం. మేము ఎటువంటి కోచ్‌లను నియమించాలనే దానిపై మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. పరిస్థితుల్ని బట్టి వారి సేవల్ని ఉపయోగంచుకుంటాం" అని తెలిపారు.

కాగా, మే నెలలో మిర్‌పుర్‌లోని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు చెందిన అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. వసీం జాఫర్ దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడు. రంజీ క్రికెట్‌లో 19 సీజన్లు ముంబైకి ప్రాతినిథ్యం వహించిన జాఫర్ చివరగా విదర్భ జట్టు తరుపున ఆడాడు.

ఒక రంజీ సీజన్‌లో రెండు సార్లు వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు. జాఫర్ 40 ఏళ్లు పైబడిన తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా, అదే విధంగా తొలి ఆసియా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

1996-97లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వసీం జాఫర్ ఇప్పటివరకు మొత్తం 251 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో యావరేజి 51.42తో 19 వేల పరుగులు చేశాడు. ఇందులో 57 సెంచరీలు, 88 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో జాఫర్ అత్యధిక స్కోరు 314 పరుగులు.

ఇక, భారత్ తరుపున వసీం జాఫర్ 2000 నుంచి 2008 వరకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం 31 టెస్టు మ్యాచ్‌లాడిన జాఫర్ 1,944 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి.

Story first published: Tuesday, July 16, 2019, 13:58 [IST]
Other articles published on Jul 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X