న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20‌ల్లో స్లిప్ లేదు కాబట్టి బతికిపోయాడు.. సూర్య బలహీనతను బయటపెట్టిన మాజీ క్రికెటర్!

Wasim Jaffer says In T20 Cricket There Is No Slip, So you Survive- On Suryakumar Yadavs Dismissals

న్యూఢిల్లీ: టీ20 ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఘాటుగా విమర్శించాడు. ఈ ధనాధన్ ఫార్మాట్‌లో స్లిప్ ఫీల్డర్ ఉండకపోవడంతో సూర్యకు మేలు చేస్తుందని చెప్పాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో అజేయ శతకంతో చెలరేగిన సూర్య.. వన్డే సిరీస్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.

మూడు వన్డేల్లో బ్యాటింగ్ చేసిన అతను రెండు సార్లు స్లిప్ ఫీల్డర్‌కు క్యాచ్ ఔటయ్యాడు. ఈ రెండు సందర్భాల్లో కూడా ఒకే తరహాలో ఔటవ్వడం చర్చనీయాంశమైంది. ఇక సూర్య వైఫల్యంపై ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ ఇన్‌ఫో డిబేట్‌లో చర్చించిన వసీం జాఫర్.. అతని బలహీనతను బయటపెట్టాడు. సూర్యకుమార్ యాదవ్‌కు స్లిప్ ఫీల్డర్ పెడితే ఆడలేకపోతున్నాడని చెప్పాడు.

త్వరగా అధిగమించాలి..

త్వరగా అధిగమించాలి..

టెస్ట్ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేయాలనుకుంటున్న సూర్య ఈ సమస్యను వీలైనంత త్వరగా అధిగమించాలని సూచించాడు. టీ20 ఫార్మాట్‌లో స్లిప్ ఫీల్డర్ ఉండడు కాబట్టే సక్సెస్ అయ్యాడని చెప్పుకొచ్చాడు.'న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో సూర్య రెండు సార్లు స్లిప్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ రెండు సార్లు ఒకే తరహాలో అతను ఔటయ్యాడు. టీ20 క్రికెట్‌లో స్లిప్ ఫీల్డర్ లేకపోవడంతో అతను బతికిపోతున్నాడు. సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగాలన్నా.. టెస్ట్ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేయాలన్నా సూర్య ఈ బలహీనతను వీలైనంత త్వరగా అధిగమించాలి.'అని తెలిపాడు.

బ్యాటింగ్ ఆర్డర్ మార్చవద్దు..

బ్యాటింగ్ ఆర్డర్ మార్చవద్దు..

తొలి వన్డేలో 4 పరుగులు చేసిన సూర్య.. మూడో వన్డేలో 6 పరుగులకే వెనుదిరిగాడు. రెండో వన్డేలో మాత్రం వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. కివీస్‌తో రెండో వన్డేలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి నాటౌట్‌గా నిలిచిన సూర్య.. తొలి, మూడు వన్డేల్లో మాత్రం ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి నిరాశపరిచాడు. దీంతో సూర్యను టీ20ల్లో ఆడించినట్టుగానే నాలుగో స్థానంలో ఆడించాలని లెఫ్ట్ హ్యాండర్‌ను నాలుగో స్థానంలో ఆడించడం కోసం సూర్య బ్యాటింగ్ ఆర్డర్ మార్చొద్దని మాజీ క్రికెటర్ సబా కరీం సూచించాడు.

ఏబీ డివిలియర్స్‌లా ఆడుతున్నాడని...

ఏబీ డివిలియర్స్‌లా ఆడుతున్నాడని...

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి మాత్రం సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. టీ20ల్లో అత్యుత్తమ ఆటగాళ్లలో సూర్య ఒకడన్న శాస్త్రి.. అతడు ఏబీ డివిలియర్స్‌లా ఆడుతున్నాని కొనియాడాడు. 'సూర్య టీ20ల్లోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. అతడు 30-40 బంతులు ఆడితే.. జట్టును గెలిపిస్తాడు. తనదైన షాట్లతో ప్రత్యర్థిని నైరాశ్యానికి గురి చేస్తాడు. ఏబీ డివిలియర్స్ ఫామ్‌లో ఉన్నప్పుడు ఎలా ఆడేవాడో... అలా ఆడుతున్నాడు' అని న్యూజిలాండ్‌తో రెండో వన్డే సందర్భంగా రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్..

వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్..

టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగిన సూర్య.. వన్డే ఫార్మాట్‌లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయాడు. ఈ ఏడాది టీ20ల్లో సూర్య అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దాంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న సూర్య.. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌ను వెనక్కి నెట్టాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ సూర్య నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ మూడు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు.

Story first published: Thursday, December 1, 2022, 13:14 [IST]
Other articles published on Dec 1, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X